Hemant Soren: 5 రోజుల ఈడీ కస్టడీకి మాజీ సీఎం
ABN, Publish Date - Feb 02 , 2024 | 03:23 PM
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 5 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల సేపు విచారణ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డేరెక్టరేట్ గత బుధవారం రాత్రి అరెస్టు చేసి రాంచీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు.
రాంచీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు 5 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల సేపు విచారణ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డేరెక్టరేట్ (ED) గత బుధవారం రాత్రి అరెస్టు చేసి రాంచీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో తీర్పును పీఎంఎల్ఏ కోర్టు శుక్రవారానికి రిజర్వ్ చేసింది.
మరోవైపు, సుప్రీంకోర్టులో సైతం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారంనాడు తోసిపుచ్చింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. తొలుత హేమంత్ సోరెన్ హైకోర్టునే ఆశ్రయించినప్పటికీ ఆ తర్వాత తన పిటిషన్ వెనక్కి తీసుకుని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Updated Date - Feb 02 , 2024 | 03:23 PM