ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

EVMs: ఈవీఎం వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్‌కి కేంద్ర మాజీ మంత్రి కౌంటర్

ABN, Publish Date - Jun 17 , 2024 | 07:21 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar ) స్పందించారు. అయితే ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా ఏం చెప్పారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Rajeev Chandrasekhar counters Elon Musk

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs) వినియోగంపై బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar ) స్పందించారు. ఈ క్రమంలో మస్క్ ఆలోచన విధానం అమెరికా సహా ఇతర ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. కానీ భారతదేశంలో ఈవీఎంలను మాత్రం హ్యాక్ చేయడం అసలు సాధ్యం కాదన్నారు.

అమెరికాలో ఇంటర్నెట్ ఆధారంగా ఓటింగ్ మిషన్లు(voting machines) పనిచేస్తాయని, ఇండియాలో మాత్రం వీటిని బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ వంటి ఏ మార్గాల ద్వారా కనెక్ట్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఈవీఎంలను రీప్రోగ్రామ్ చేయడం సాధ్యం కాదని వెల్లడించారు. ఈ విషయంలో అవసరమైతే ఎలాన్ మస్క్‌కి ట్రైనింగ్ కూడా ఇస్తామని, వీటిని మీ దేశంలో కూడా తయారు చేయవచ్చని చంద్రశేఖర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలను మనుషులు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేసే అవకాశం ఉందని, వాటిని తొలిగించి పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలని మస్క్(Elon Musk) తన 'ఎక్స్' పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్(EVMs) యంత్రాలకు సంబంధించి వందల సంఖ్యలో ఓటింగ్ అవకతవకలు జరిగాయని అమెరికా అధ్యక్ష అభ్యర్థి కెన్నెడీ సోషల్ మీడియా ఎక్స్‌లో చేసిన పోస్టుకు ఎలాన్ మస్క్ ఈ విధంగా స్పందించారు.

మస్క్ ట్వీట్ చేసిన నేపథ్యంలో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలను వదిలేసి పేపర్ ఓటింగ్ విధానాన్ని అవలంబించాలనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి స్పందించారు. మరోవైపు మస్క్ ట్వీట్ తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) సహా అనేక మంది నేతలు ఈవీఎంల హ్యాకింగ్ గురించి వ్యాఖ్యలు చేయడం విశేషం.


ఇది కూడా చదవండి:

Rahul Gandhi: ఈవీఎంలపై అనుమానాలు.. ఎన్నికల ప్రక్రియలో లోపాలపై ప్రశ్నలు సంధించిన రాహుల్..


Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే


Read Latest National News and Telugu News

Updated Date - Jun 17 , 2024 | 07:27 AM

Advertising
Advertising