ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

French President : ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ రద్దు

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:30 AM

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్‌ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

  • ఈయూ ఎన్నికల్లో మద్దతు కోల్పోడంతో

  • మేక్రాన్‌ ‘ముందస్తు’ నిర్ణయం

పారిస్‌, జూన్‌ 10: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్‌ ర్యాలీ విజయం సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రజావిశ్వాసం మేరకు ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని మేక్రాన్‌ భావిస్తున్నారు. ఈయూ ఎన్నికల్లో మేక్రాన్‌పార్టీ రెనాయిసెన్స్‌కు 15 శాతం ఓట్లు, ప్రతిపక్ష నేషనల్‌ ర్యాలీ పార్టీకి సుమారు 32 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అయితే దేశంలో తమ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోలేదని నిరూపించేందుకు మేక్రాన్‌ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు. ‘‘ఈ రోజు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నా.

ఈ నిర్ణయం చాలా పెద్దది. ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకంతో, భవిష్యత్‌ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని మేక్రాన్‌ తెలిపారు. ఫ్రాన్స్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మేక్రాన్‌ ప్రకటనపై ప్రతిపక్ష నాయకుడు జోర్డాన్‌ బార్డెల్లా వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తెలిపారు. జూన్‌ 30న మొదటి దశ, జులై 7 చివరి దశ పోలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. కాగా, 2022లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా మేక్రాన్‌ రెండో సారి ఎన్నికయ్యారు. 2027 వరకు ఆయన తన పదవీలో కొనసాగనున్నారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:30 AM

Advertising
Advertising