Prajwal Revanna: ప్రజ్వల్‌కు మళ్లీ లుకౌట్ నోటీసు.. ఇంట్లో సిట్ సోదాలు
ABN, Publish Date - May 04 , 2024 | 04:35 PM
కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్న లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును చేపట్టిన 'సిట్' ఆయనకు లుకౌట్ నోటీసులు జారీచేయగా, శనివారంనాడు తాజాగా మరోసారి ఆయనకు, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్న లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజల్వ్ రేవణ్ణ (Prajwal Revanna) చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును చేపట్టిన 'సిట్' (SIT) ఆయనకు లుకౌట్ నోటీసులు (lookour notice) జారీచేయగా, శనివారంనాడు తాజాగా మరోసారి ఆయనకు, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 'అశ్లీల వీడియోల కేసు' దర్యాప్తులో భాగంగా ఉదయం హసన్‌లోని ప్రజ్వల్ ఇంటికి కూడా సిట్ అధికారులు వెళ్లారు. ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
తాజా పరిణామాలపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ, హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణకు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. హెచ్‌డీ రేవణ్ణ విదేశాలకు వెళ్లే యోచన చేసే అవకాశాలున్నందున లుకౌట్ నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారమే నోటీసులు ఇచ్చామని, సమాధానం చెప్పేందుకు శనివారం సాయంత్రం వరకూ వారికి సమయం ఉందని తెలిపారు. దర్యాప్తు బృందం ముందు హాజరయ్యేందుకు తమకు సమయం కావాలంటూ ప్రజ్వల్, హెచ్‌డీ రేవణ్ణ కోరడంతో వారికి ఫస్ట్ లుకౌట్ నోటీసు ఇచ్చారు. తాజాగా మరోసారి నోటీసు పంపారు.
Lok Sabha Elections 2024: మా అన్న యువరాజైతే ఆయన చక్రవర్తి.. మోదికి ప్రియాంక కౌంటర్
ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో ఇటీవల వీడియోలు రావడం, అందులోనూ సార్వత్రిక ఎన్నికల మధ్యలో ఇవి వెలుగు చూడటం రాజకీయంగా కూడా సంచలనమైంది. ఈ నేపథ్యంలోనే రేవణ్ణ దేశం విడిచిపెట్టి జర్మనీకి వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులతో ఆయన దేశంలోకి అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది.
సీఎంకు రాహుల్ లేఖ
కాగా, ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శనివారంనాడు ఒక లేఖ రాశారు. న్యాయం కోసం పోరాడుతున్న బాధితుల పట్ల సానుభూతి, సంఘీభావం చూపించాల్సిన అవసరం ఉందని, ఇంతటి నీచమైన నేరాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తెచ్చే బాధ్యతను అన్ని పార్టీలు తీసుకోవాలని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - May 04 , 2024 | 05:57 PM