ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Visarjan 2024: ముంబయిలో గణేశ్‌ని నిమజ్జనం

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:04 PM

దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది. గణేశ్ నిమజ్జనం నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వీధులన్నీ భారీ గణనాథులతో ఊరేగింపుగా బయలుదేరాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు.

ముంబయి, సెప్టెంబర్ 17: దేశవ్యాప్తంగా గణపతి నిమజ్జనం జరుగుతుంది. గణేశ్ నిమజ్జనం నేటితో అంటే మంగళవారంతో ముగియనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో వీధులన్నీ భారీ గణనాథులతో ఊరేగింపుగా బయలుదేరాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు రహదారులపైకి వచ్చారు. నగరంలోని పలు ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.

Also Read: Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Also Read: టెలిఫోన్ భవన్ చేరుకున్న బడా గణపతి


ముంబయి మహానగరంలో ట్రాఫిక్‌ను వివిధ ప్రాంతాల వైపు పోలీసులు మళ్లిస్తున్నారు. ఉత్తర, దక్షిణ ముంబయిని అనుసంధానించే సముద్ర తీర ప్రాంతం రహదారిని పూర్తిగా మూసివేశారు. ఈ రహదారిని బుధవారం తెరుస్తామని పోలీసులు వెల్లడించారు. నిమజ్జనానికి వాహనాల్లో కాకుండా.. లోకల్ ట్రైయిన్లలో ప్రయాణించాలని ముంబయి నగర వాసులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read: History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ చరిత్ర ఇదే..

Also Read: Gold and Silver Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీగా పెరిగిన వెండి రేటు


మరోవైపు వినాయక నిమజ్జనం వేళ... నగరంలోని 13 రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. గట్కోపర్, కర్రీ రోడ్, బైకుల్లా, మెరైన్ లైన్స్, దాదర్ తికల్, తదితర ప్రాంతంల్లోని రహదారులపై పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతాల్లో డ్యాన్సులు చేయవద్దని.. అలాగే డీజేలు ఏర్పాటు చేయవద్దని ప్రజలకు పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

Also Read: New York: స్వామినారాయణ్ ఆలయంపై దాడి: ఖండించిన భారత్

Also Read: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. ఘోష్ ఫామ్ హౌస్‌లో ఈడీ సోదాలు


ముంబయిలోని పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనం జరుగుతుంది. మరి ముఖ్యంగా గిర్గావ్ చౌపట్టి, జుహు బీచ్‌ల వద్దకు నిమజ్జనం కోసం ఇప్పటికే భారీ గణేశ్ విగ్రహాలు చేరుకున్నాయి. ఈ రెండు ప్రాంతాలతోపాటు గణేశ్ నిమజ్జనం జరిగే ఇతర ప్రాంతాల్లో సైతం లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చారు.

For More National News and Telugu News

Updated Date - Sep 17 , 2024 | 03:13 PM

Advertising
Advertising