Gangster: ఆరు గంటల పెరోల్ తీసుకుని పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్టర్
ABN, Publish Date - Mar 12 , 2024 | 04:21 PM
సాధారణంగా ఏదైనా ప్రముఖుల పెళ్లిళ్లు జరిగితే పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధమని చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా ఓ గ్యాంగ్‌స్టర్ పెళ్లిపై ఏకంగా నాలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు.
సాధారణంగా ఏదైనా ప్రముఖుల పెళ్లిళ్లు జరిగితే పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధమని చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా ఓ గ్యాంగ్‌స్టర్ పెళ్లిపై ఏకంగా నాలుగు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాదు ఆ గ్యాంగ్‌స్టర్(gangster) పెళ్లి కోసం కోర్టు నుంచి పెరోల్ తీసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్‌స్టర్ కళా జాతేడి(Kala Jathedi), లేడీ డాన్ అనురాధ చౌదరి(Anuradha Choudhary) మంగళవారం వివాహం(marriage) చేసుకున్నారు.
ఢిల్లీ(delhi)లోని ద్వారకలోని సంతోష్ గార్డెన్‌లో వీరి పెళ్లి(wedding) జరిగింది. ఈ పెళ్లి కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వివాహాన్ని ప్రశాంతంగా నిర్వహించడం పోలీసులు, భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఇద్దరు కూడా క్రిమినల్ బ్యాగ్ రౌండ్ ఉన్న వ్యక్తులు కావడం, వారి సన్నిహితులు కూడా అలాగే ఉండటం పోలీసులకు కీలకంగా మారింది.
భద్రత ఫుల్
ఆధార్ కార్డు లేదా ఇతర ID రుజువును చూపించిన వారిని మాత్రమే భద్రతా సిబ్బంది(police) లోనికి పంపించారు. దీంతోపాటు సెక్యూరిటీ చెకింగ్ కోసం రెండు మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు కస్టడీ పెరోల్ సమయంలో భద్రతా సిబ్బంది తీహార్ జైలు నుంచి కాలా జాతేడిని తీసుకువచ్చారు. వధువు లేడీ డాన్ అనురాధ చౌదరి తన సొంత స్కార్పియో కారును నడుపుతూ రెడ్ కలర్ సారీ ధరించి పెళ్లికి వచ్చారు.
కోర్టు జాతేడి పెళ్లికి 6 గంటల కస్టడీ పెరోల్(parole) ఇచ్చింది. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు కాలా జాతేడి ముఠాకు చెందిన కొందరు అక్రమార్కులు ఏజెన్సీల కస్టడీలోకి వచ్చారు. దీని కారణంగా కాలా జాతేడి సహా అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని ముఠాలోని వ్యక్తులు కాలా జాతేడిని విడిపించడానికి ప్రయత్నించవచ్చనే భయాలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Amit Shah: తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఎంతో చెప్పేసిన షా.. త్వరలో రేవంత్‌కు జాబితా!
వీరెవరు?
గ్యాంగ్‌స్టర్ కాలా జాతేడి అలియాస్ సందీప్ హర్యానా(haryana)లోని సోనిపట్‌లోని జాతేడి గ్రామానికి చెందినవాడు. అతనిపై దాదాపు మూడు డజన్లకుపైగా కేసులు నమోదయ్యాయి. అతను పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. లారెన్స్ బిష్ణోయ్‌కి ప్రత్యేక స్నేహితుడు. 2021లో ముజఫర్‌పూర్‌లో అనురాధతో పాటు జాతేడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
లేడీ డాన్ అనురాధ చౌదరి(Anuradha Choudhary) అలియాస్ మేడమ్ మింజ్ రాజస్థాన్ నివాసి. ఆమె దాదాపు 15 ఏళ్లుగా నేర ప్రపంచంలో ఉంది. మొదట్లో ఆమెకు రాజస్థాన్‌కు చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్‌తో సంబంధం ఉంది. ఆ తర్వాత ఆనంద్‌పాల్ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన తర్వాత, ఆమె జాతేడితో చేరింది. అనురాధపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
Updated Date - Mar 12 , 2024 | 04:21 PM