ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bihar Politics: నితీశ్ రాజీనామాపై లాలూ కుమార్తె రియాక్ట్.. చెత్త చెత్తబుట్టలోకి వెళ్లిందంటూ..

ABN, Publish Date - Jan 28 , 2024 | 03:56 PM

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బిహార్‌లో రాజకీయ గందరగోళం నడుమ సీఎం పదవికి రాజీనామా చేసిన జనతాదళ్(యూ) అధ్యక్షుడు నితీష్ కుమార్‌పై ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త ఇప్పుడు మళ్లీ డస్ట్‌బిన్‌లోకి తిరిగి వెళ్లిందని చెత్త వ్యాన్ చిత్రాన్ని పోస్ట్ చేసి ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీంతోపాటు తన సోదరుడు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వీడియోను పంచుకుంటూ ప్రజలు ప్రజల మధ్యకు వెళ్తారు. వారు తమతోపాటు బిహార్‌లో మనోధైర్యాన్ని పెంచుతారని ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.


తన రాజీనామా అనంతరం నితీష్ మాట్లాడుతూ..గతంలో ఉన్న కూటమిని వీడి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తా’’ అని ప్రకటించారు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, 18 నెలల కిందటే తాను చేరిన మహాకూటమి, ప్రతిపక్ష ఇండియా సరిగ్గా పనిచేయడం లేదని నితీష్ కుమార్ అన్నారు. ఇప్పుడు బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో నితీష్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీట్ల పంపకం చర్చలు విఫలమైన కారణంగా కుమార్ ఇండియా కూటమితో కలత చెందారని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.

బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం పతనం అంచున ఉందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఇప్పటికే అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఒక వర్గం కుమార్‌ను పదేపదే అవమానించిందని ఆయన ఆరోపించారు.

Updated Date - Jan 28 , 2024 | 04:02 PM

Advertising
Advertising