ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది

ABN, Publish Date - Jun 30 , 2024 | 03:11 PM

భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా(COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 మేలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. ద్వివేది ఇదివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పని చేశారు.

ఢిల్లీ: భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా(COAS) జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2022 మేలో జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా.. ఆయన ఇటీవలే రిటైర్ అయ్యారు. ద్వివేది ఇదివరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పని చేశారు. పరమ విశిష్ట(Param Vishisht Seva Medal), అతి విశిష్ట సేవా పతకాలు, 3 జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్ కమెండేషన్ కార్డ్‌లు ఆయన్ని వరించాయి. ద్వివేది మధ్యప్రదేశ్ నివాసి. ఆయన రేవాలో సైనిక్ స్కూల్‌లో చదువుకున్నారు.

1981 జనవరిలో నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(NDA)లో చేరారు. 1984 డిసెంబర్‌లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్18వ బెటాలియన్‌లో నియమితులయ్యారు. తరువాత కశ్మీర్ లోయలో కమాండర్‌గా విధులు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో ఉత్తమ క్రీడాకారుడిగా, ఇండియన్ మిలిటరీ అకాడమీ(IMA), నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రాణించారు. ఫిజికల్ ట్రైనింగ్ కోర్సులో బంగారు పతకాన్ని అందుకున్నారు.


కశ్మీర్ లోయలో, రాజస్థాన్ ఎడారులలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. ఈశాన్య ప్రాంతంలో కమాండ్ నియామకాలను చేపట్టారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తగ్గించడానికి వ్యూహాలు రచించారు.

భారత సైన్యాన్ని అత్యాధునిక ఆయుధాలతో ఆధునికీకరించేందుకు కృషి చేశారు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన సునీతా ద్వివేదిని ఆయన వివాహం చేసుకున్నారు. సునీతా ద్వివేది భోపాల్‌లోని దివ్యాంగ చిన్నారుల కోసం ఆరుషి అనే సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


మనోజ్ పాండే...

పదవీ విరమణ చేసిన ఆర్మీ చీఫ్ జనరల్ పాండే, కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఆర్మీ చీఫ్ అయిన మొదటి అధికారి. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. జనరల్ పాండే 1982 డిసెంబర్‌లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితుడయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్ ‌పరాక్రమ్ సమయంలో ఆయన ఇంజనీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 03:11 PM

Advertising
Advertising