ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: శభాష్ తల్లి.. వయనాడ్‌కి విరాళం కోసం 3 గంటలపాటు భరతనాట్యం

ABN, Publish Date - Aug 09 , 2024 | 05:28 PM

కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు.

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లాలో(Wayanad Landslides) ప్రకృతి విపత్తు చూపిన విలయం అంతాఇంతా కాదు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 417 మందికిపైగా చనిపోగా.. 150 మందికిపైగా మృతదేహాల ఆచూకీ ఇంకా లభించలేదు. సర్వస్వం కోల్పోయిన బాధితుల కోసం విరాళాలందించేందుకు ప్రముఖులు ముందుకొచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం తరఫున రూ. 5 కోట్లు, తమిళ స్టార్ హీరోలు, టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 2కోట్లు, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ కలిపి రూ. కోటి, అల్లుఅర్జున్ రూ.25 లక్షలు అందించారు. వీరితోపాటు కంపెనీల అధినేతలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఇంకా ఎందరో వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. సామాన్యులు సైతం విరాళాలు అందించడానికి ముందుకొచ్చారు. అయితే తమిళనాడుకి చెందిన ఓ బాలిక(13) తన వంతు సాయంగా వయనాడ్ బాధితుల కోసం ఏదైనా చేయలనుకుంది. ఇందుకోసం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తనకు వచ్చిన కళతో విరాళాలు సేకరించింది.


ఆ నగదును కేరళ సీఎం పినరయి విజయన్‌కి అందించి ఎనలేని స్ఫూర్తిని నింపింది. హరిణి శ్రీ అనే బాలిక వయనాడ్ దుర్ఘటన జరిగినప్పటి నుంచి పేపర్లు, టీవీల్లో విషాదకర వార్తలు చూస్తూ తీవ్ర మనోవేదనకు గురయ్యేది. బాధిత కుటుంబాలకు తన వంతుగా ఏదైనా చేయాలని భావించేది. అలా ఓ సాహస నిర్ణయం తీసుకుంది. ఏకంగా 3 గంటలపాటు నిరంతరాయంగా భరతనాట్యం చేసి రూ.15 వేల విరాళాలను సేకరించింది. ఆ మొత్తాన్ని సీఎండీఆర్ఎఫ్‌కి అందించింది. విషయం తెలుసుకున్న సీఎం విజయన్ బాలికను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆమె భరత నాట్య నృత్య ప్రదర్శనను చూశారు. చిన్నవయసే అయినా అంత పెద్ద మనసుతో అతి కష్టమైన పని చేసి విరాళాలు సేకరించడంపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బాలికను అభినందించి.. కాసేపు ముచ్చటించారు. కాగా.. హరిణి రగిల్చిన స్ఫూర్తి అందరికీ ఆదర్శంగా నిలిచింది. నెటిజన్లు హరిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధితుల కన్నీరు తుడవడానికి చిట్టి చేతులతో ఇచ్చిన ఆ విరాళం ఎంతో గొప్పదని వారు అంటున్నారు.


జాతీయ విపత్తుగా ప్రకటించాలి..

కాగా వయనాడ్ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం పినరయి విజయన్ శుక్రవారం తెలిపారు. విపత్తు తీవ్రతను పరిశీలించి నివేదిక సమర్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తొమ్మిది మంది సభ్యులతో కమిటీని నియమించిందని చెప్పారు. జులై 30న వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన కారణంగా నష్టపోయిన వారికి సాయం చేసేందుకు దేశ నలుమూలల నుంచి ముందుకువచ్చారు.

కుండపోత వర్షాల కారణంగా వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి, ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద 400లకుపైగా ప్రజలు చిక్కుకున్నారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 417 మంది మరణించారు.ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఆగస్టు 10) వయనాడ్‌లో పర్యటించనున్నారు.అక్కడే ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాగా విపత్తును ఎదుర్కొనేందుకు తమకు అన్ని రకాలుగా సాయం చేస్తోందని విజయన్ తెలిపారు.

Updated Date - Aug 09 , 2024 | 05:28 PM

Advertising
Advertising
<