ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhya Pradesh Govt: పాఠ్యాంశాల్లో రాముడు, కృష్ణుడు సరే.. మరి ఆ పాపాలకు బాధ్యులు ఎవరు?

ABN, Publish Date - Jun 22 , 2024 | 06:18 PM

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.

MadhyPradesh Congress Chief Jitendra Patwari

భోపాల్, జూన్ 22: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ పట్వారీ శనివారం భోపాల్‌లో స్పందించారు.

Also Read: Video Viral: బిహార్‌లో కూలిన మరో వంతెన.. వారంలో రెండో ఘటన


ప్రభుత్వ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. పాఠ్యాపుస్తకాల్లో అవతార పురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి బోధించడం మంచిదేనన్నారు. అయితే పరీక్ష పేపర్ల లీకేజి, కుంభకోణాలు, అవినీతి వంటి పాపాలను ముందు నిరోధించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Also Read: Swati Maliwal assault case: బిభవ్ కుమార్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు


ప్రతి కుటుంబంలో శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని నిత్యం పూజిస్తూ ఉంటామన్నారు. అలాగే చిన్ననాటి నుంచి ప్రతీ తండ్రి.. శ్రీరాముడిలా ఆలోచించు.. ఆయనలాగా మంచిగా ఉండాలంటూ చెబుతారన్నారు. పుస్తకాల్లో ఈ అవతార పురుషుల గురించి చదవడం మంచిదే.. కానీ పేపర్ల లీకేజితో విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నిరోధించడం మీ ప్రభుత్వ బాధ్యత కాదా? అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Also Read: Delhi Water Crisis: మంచి నీటి కోసం ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు.. ఢిల్లీ పోలీసులు ఏం చేశారంటే..?


రిక్రూట్‌మెంట్స్ స్కామ్స్ వెనుకనున్న కారణాలు ఏమిటని ఈ సందర్బంగా మోహన్ యాదవ్ ప్రభుత్వాన్ని జితేంద్ర పట్వారీ సూటిగా ప్రశ్నించారు. పరీక్ష పేపర్ల లీకేజి, కుంభకోణాలు, అవినీతి వంటి పాపాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు పాఠ్యాంశాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడి చేరుస్తామంటూ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటనను రామ జన్మభూమి దేవాలయం ప్రధాన పూజారీ ఆచార్య సత్యేంద్ర దాస్ స్వాగతించారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2024 | 06:20 PM

Advertising
Advertising