Google KK Doodle: బాలీవుడ్ సింగర్‌కి గూగుల్ గౌరవం
ABN , Publish Date - Oct 25 , 2024 | 06:01 PM
దిగ్గజ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నాత్ అంతే తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హింధీలో 500లకుపైగా పాటలు, ఇతర భారతీయ భాషల్లో 200లకు పైగా పాటలు పాడి అలరించారు. ప్రక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయనను గౌరవిస్తూ గూగుల్ ప్రత్యేక ఇవాళ డూడుల్ యానిమేషన్‌ను ప్రచురించింది.
చారిత్రాత్మక ఘట్టాలను, ప్రముఖ వ్యక్తులను ప్రత్యేక రోజుల్లో డూడుల్ ద్వారా గుర్తుచేసే సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇవాళ (శుక్రవారం) బాలీవుడ్ ప్రముఖ సింగర్ కేకేని (క్రిష్ణ కుమార్ కున్నాత్) ప్రత్యేకంగా గౌరవించింది. డూడుల్ యానిమేషన్‌ను విడుదల చేసింది. 1996లో సరిగ్గా ఇదే రోజున (అక్టోబర్ 25) బాలీవుడ్‌లో ఆయన తొలి పాడిన తొలి పాట విడుదలైంది. ‘ఛోడ్ ఆయే హమ్’ అనే పాటను ఆయన పాడారు. ఈ పాట పొలిటికల్ థ్రిల్లర్ అయిన ‘మాచిస్’ సినిమాలో ఉంది.
కాగా డూడుల్‌లో కేకే నిలుచొని పాట పాడుతున్నట్టుగా, అతడి చేతిలో మైక్ ఉన్నట్టుగా రూపొందించింది. బ్యాక్‌డ్రాప్‌లో గూగుల్ పేరు కనిపించింది. మ్యూజిక్ సింబల్స్, స్టార్ ఎమోజీలను ఉంచింది.
ఇక వెబ్‌సైట్‌లో అతడిని ప్రశంసిస్తూ ఒక నోట్ రాసింది. ‘‘బహుముఖ ప్రజ్ఞశాలి, ప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్(కేకే) విజయాన్ని గూగుల్ సెలబ్రేట్ చేసింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ వంటి అనేక భాషలలో ఆయన పాటు పాడారు. వివిధ భాషల్లో పాటలు రికార్డ్ చేసినందుకు ఆయన విస్తృత గుర్తింపు పొందారు’’ అని నోట్‌లో డూగుల్ పేర్కొంది.
ఖుదా జానే, అంఖోన్ మే తేరీ, తు హీ మేరీ షబ్ హై వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను హిందీలో పాడారు. మూడు దశాబ్దాల కెరీర్‌లో హిందీలో 500కి పైగా పాటలు పాడారు. ఇక తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళ భాషల్లో 200కి పైగా పాటలు పాడారు. మే 31, 2022న కోల్‌కతాలో ఆయన కన్నుమూశారు. సంగీత కచేరీ చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన చనిపోయారు.