ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google Map: అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

ABN, Publish Date - Jul 02 , 2024 | 08:45 PM

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని.. గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో.. ఇటీవల చాలా సంఘటనల్లో మనం చూశాం. ఈ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆశావహులు.. మరో పరీక్ష కేంద్రానికి వెళ్లారు.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని.. గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునే వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో.. ఇటీవల చాలా సంఘటనల్లో మనం చూశాం. ఈ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఆశావహులు.. మరో పరీక్ష కేంద్రానికి వెళ్లారు. దీంతో తమకే కేటాయించిన పరీక్ష కేంద్రం ఇది కాదని వారు తెలుసుకున్నారు. అనంతరం తమ పరీక్ష కేంద్రానికి చేరుకునే సరికి పుణ్య కాలం కాస్తా పూర్తయింది. దీంతో వారు ఆ పరీక్ష రాయకుండానే ఇంటి ముఖం పట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఇటీవల చోటు చేసుకుంది.

Also Read: YS Sharmila: సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్ఆర్ జయంతి..

Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?


అలాగే గూగుల్ మ్యాప్‌ను అనుసరించి.. కారులో బయలుదేరిన వాళ్లు వాగులో వెళ్లారు. ఈ ఘటన తాజాగా కేరళలో చోటు చేసుకుంది. ఇదే తరహా సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. కటక్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో సుజిత్య సాహు, సుర్యప్రకాశ్ మహంతి, శుభన్ మహాపాత్ర, హిమాన్ష్ దాస్, అరక్షిత్ మహాపాత్ర చదువుకుంటున్నారు. జూన్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ విద్యార్థులంతా బైకులపై గూగుల్ మ్యాప్‌ను అనుసరించి.. సప్తసజ్య దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం వారు కొండపైన ఉన్న విష్ణు బాబా మఠాన్ని సందర్శించారు. ఆ తర్వాత వారు తిరుగు ప్రయాణమయ్యారు.

Also Read: Uttar Pradesh: తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి

Also Read: AndhraPradesh: 11 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ


అయితే ఆ క్రమంలో వారు గూగుల్ మ్యాప్‌ను అనుసరించడంలో.. వారంతా దట్టమైన అడవిలోకి వెళ్లి పోయారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 2.00 గంటలైంది. వారికి దారి తెలియక పోవడంతో తీవ్ర ఆందోళన చెందారు. సాయంత్రం 5.30 గంటలకు భూషుని ఖోలా దేవాలయానికి చేరుకున్నారు. ఆ దేవాలయంలో సందర్శకుల ప్రవేశానికి అనుమతి లేదు. దీంతో ఎవరైనా సహాయం చేస్తారని వారంతా ఎదురు చూస్తున్నారు. తమ ఫోన్లు ద్వారా ఎవరైనా అందుబాటులోకి వస్తారని ఆశించారు.

Also Read: Nimmala Ramanaidu: కృష్ణా డెల్లాకు రేపు సాగు, తాగు నీరు విడుదల

Also Read: Madhya Pradesh: ముగ్గురు చిన్నారులు మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం


అలా ఆ విద్యార్థుల్లో ఒకరికి ఫోన్‌లో పోలీస్ అందుబాటులోకి వచ్చారు. దాంతో తాము అడివిలో చిక్కుకు పోయామంటూ దెంకనల్ పోలీసులకు సదరు విద్యార్థి వివరించాడు. దాంతో వారిని రక్షించేందుకు దెంకనల్ పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. అందులోభాగంగా రెండు బృందాలు వీరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు వారున్న ప్రాంతానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నారు. మొత్తం 11 గంటల పాటు వీరంతా అడవిలో చిక్కుకు పోయి.. టెన్షన్ టెన్షన్ పడ్డారు.

Also Read: West Bengal: చోప్రా వీడియో ఘటనలో కీలక మలుపు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 08:48 PM

Advertising
Advertising