ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Greater Chennai: నగరంలో త్వరలో ‘ఎయిర్‌ టాక్సీ’ సేవలు!

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:57 PM

గ్రేటర్‌ చెన్నై(Greater Chennai)లో వచ్చే ఏడాది మార్చి నుంచి ఎగిరే విద్యుత్‌ టాక్సీ సేవలు ప్రారంభయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా నగరం నుంచి 14 నిమిషాల వ్యవధిలో శివారు ప్రాంతమైన తాంబరం చేరుకోవచ్చు.

చెన్నై: గ్రేటర్‌ చెన్నై(Greater Chennai)లో వచ్చే ఏడాది మార్చి నుంచి ఎగిరే విద్యుత్‌ టాక్సీ సేవలు ప్రారంభయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ద్వారా నగరం నుంచి 14 నిమిషాల వ్యవధిలో శివారు ప్రాంతమైన తాంబరం చేరుకోవచ్చు. నగరానికి చెందిన ‘ఈ ప్లాన్‌’ అనే స్టార్టప్‌ సంస్థ ఎయిర్‌ టాక్సీలను అత్యాధునిక డిజైన్‌తో రూపొందించింది. ప్రధాన నగరాల్లో నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ నివారించే దిశగా మొట్టమొదటగా 26 కిలోల బరువు మోయగల డ్రోన్‌లను తయారుచేసి విక్రయించేందుకు ఈ సంస్థ నిర్ణయించింది.

ఇదికూడా చదవండి: Patanjali: పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!

కాగా, ఈ ఎయిర్‌ టాక్సీ(Air Taxi) ఉన్న స్థలం నుంచి పైకి ఎగురుతుంది. అలాగే, దిగే సమయంలో కూడా ఎలాంటి కుదుపులుండవు. సహజంగా వాహనాల్లో నగరం నుంచి తాంబరం చేరుకోవాలంటే దాదాపు 60 నుంచి 75 నిమిషాలు అవుతుంది. ఈ ఎయిర్‌ టాక్సీ అందుబాటులోకి వస్తే 14 నిమిషాల్లోనే తాంబరం చేరుకోవచ్చు. నలుగురు వ్యక్తులు కూర్చొనే విధంగా, డిజైన్‌ చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలు వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా

Read Latest National News and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 12:58 PM

Advertising
Advertising