ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Khattar Resigns: హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే

ABN, Publish Date - Mar 12 , 2024 | 12:05 PM

హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే క్యాబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి కారణమైంది.

న్యూఢిల్లీ: హర్యానాలో (Haryana) కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ (BJP) నేత మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే క్యాబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి కారణమైంది. కాగా కొన్ని రోజులుగా కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

కాగా హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 40 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుశ్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున కీలక నిర్ణయం?

Mission Divyastra : తిరుగులేని ‘దివ్యాస్త్రం’!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 12:13 PM

Advertising
Advertising