ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Haryana Cabinet: మంత్రివర్గాన్ని విస్తరించిన సీఎం, కొత్తగా 8 మందికి చోటు

ABN, Publish Date - Mar 19 , 2024 | 06:22 PM

హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు.

చండీగఢ్: హర్యానా (Haryana) ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు.


కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో హిసార్ బీజేపీ ఎమ్మెల్యే కమల్ గుప్తా, బఢ్‌ఖల్ ఎమ్మెల్యే సీమా త్రిఖ, పానిపట్ రూరల్ ఎమ్మెల్యే మహిపాల్ ధాండ, అంబాలా సిటీ ఎమ్మెల్యే అసీమ్ గోయెల్, నాంగల్ చౌదరి ఎమ్మెల్యే అభె సంగ్ యాదవ్, థానేసర్ ఎమ్మెల్యే సుభాష్ సుధ, బవాని ఖేర ఎమ్మెల్యే బిషాంబర్ సింగ్ బాల్మీకి, సోహ్నా ఎమ్మెల్యే సంజయ్ సింగ్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సైతం ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వారంలో సైనీ, ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 06:22 PM

Advertising
Advertising