Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..
ABN, Publish Date - Jul 03 , 2024 | 02:14 PM
విధి నిర్వహాణలో భాగంగా ఎటా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన కానిస్టేబుల్ రవిని హార్ట్ అటాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో బోలే బాబా సత్సంగ్ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
విధి నిర్వహాణలో భాగంగా ఎటా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన కానిస్టేబుల్ రవిని హార్ట్ అటాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో బోలే బాబా సత్సంగ్ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో వందమందికిపైగా మరణించారు. 28 మంది గాయపడ్డారు. ఆ మృతదేహాలతోపాటు క్షతగాత్రులను ఎటా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
దీంతో ఆ ప్రాంతమంతా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోధనలతో నిండిపోయింది. అదే సమయంలో విధి నిర్వహాణలో భాగంగా ఆసుపత్రికి వచ్చిన కానిస్టేబుల్ రవి.. ఆ హృదయ విదారక ఘటనను చూసి తట్టుకోలేక పోయాడు. ఆ క్రమంలో కళ్లు తిరిగి కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ ప్రేమ్‌రంజన్ సింగ్, ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్.. సిబ్బంది సహాయంలో కానిస్టేబుల్ రవిని ఏసీ గదికి తరలించారు. అతడి షర్ట్ తీసి.. ప్రాధమిక చికిత్స అందిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ రవి మృతి చెందారు. అతడు హార్ట్ అటాక్‌తో మరణించాడని వైద్యులు ధృవీకరించారు.
మృతుడు రవి హాథ్రాస్ పొరుగునున్న ఎటా జిల్లాలోని అవాగడ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మంగళవారం హాథ్రాస్ జిల్లాలోని పుల్‌రాయ్ గ్రామంలో సత్సంగ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తన సహచర ఉద్యోగి శేఖర్ ప్రేమి ద్వారా రవికి సమాచారం అందించాడు. విధి నిర్వహాణలో భాగంగా ఎటా మెడికల్ కాలేజీకి వెళ్లాలని రవికి శేఖర్ సూచించాడు. అలా విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన కానిస్టేబుల్ రవి హార్ట్ అటాక్‌తో విగత జీవిగా మారాడు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 03 , 2024 | 02:14 PM