Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. పరిస్థితి అతలాకుతలం..
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:53 AM
ఉత్తర ప్రదేశ్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. యూపీలో 11 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. వర్షాలు, వరదల కారణంగా 3,056 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితులకు సహాయం అందిస్తోంది.
ఉత్తర ప్రదేశ్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) కారణంగా అనేక ప్రాంతాల్లో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. యూపీ (UP)లో 11 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి (17 people died) చెందారు. వర్షాలు, వరదల కారణంగా 3,056 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితులకు సహాయం అందిస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs. 4 lakhs Exgratia) ప్రకటించింది. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం అధికారులు ఫ్లడ్ పిఎసి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. హత్రాస్ జిల్లాలో అత్యధికంగా 185.1 మిమీ వర్షపాతం నమోదైంది.
కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నగరం జాకీర్ కాలనీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో 10 మంది మరణించారు. సమాచార శాఖ ప్రకారం శిథిలాలలో చిక్కుకున్న మొత్తం 15 మందిలో 14 మందిని బయటకు తీయగా, వారిలో 10 మంది మరణించారు. NDRF, SDRF బృందాలు మీరట్‌లోని జాకీర్ కాలనీలో తమ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్నిఫర్ డాగ్‌లను ఉపయోగించి గుర్తించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో మరో ఆరుగురు శిథిలాలలో చిక్కుకోగా, వీరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇల్లు చాలా పాతది కావడంతో నిరంతర కురుస్తున్న భారీ వర్షాలు ఇంటిపై ప్రభావం చూపించాయి. ఆ క్రమంలోనే మూడంతస్తుల ఇల్లు ఒక్కసారిగా నేలకూలింది. ఇంటి కింది అంతస్తులో డెయిరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో పశువులు కూడా శిథిలాల కింద కూరుకుపోయాయి. విచారణ తర్వాతే ప్రమాదానికి నిజమైన కారణాలు తెలుస్తాయి. ఇంటి యజమానిని అల్లావుద్దీన్‌గా గుర్తించారు. ఆ భవనంలో డెయిరీని నడుపుతున్నాడు. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..
యూపీ సీఎం యోగి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్రంలో 11 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. వర్షాలు,వరదల కారణంగా 3,056 ఇళ్లు దెబ్బతిన్నాయి. నిర్వాసితులకు ప్రభుత్వం సహాయం అందిస్తోంది. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అసమర్థ వ్యక్తి జగన్.. సీఎం ఎలా అయ్యారు?
క్షమాపణలు చెప్పించుకున్న కేంద్రమంత్రి
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజరికపు పొకడలకు స్వస్తి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 15 , 2024 | 11:53 AM