Ram Mandir: అయోధ్య రాములోరి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తోపులాట
ABN, Publish Date - Jan 23 , 2024 | 08:58 AM
అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది.
అయోధ్య: అయోధ్యలో బాలరాముడిని (Ram Lalla) దర్శించుకునేందుకు మంగళవారం నాడు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి అధిక సంఖ్యలో వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో తోపులాట జరిగింది. బాల రాముడిని దర్శించుకొని, తరించేందుకు భక్తులు నిద్రను లెక్క చేయలేదు. మంగళవారం ఉదయం దర్శించుకోవాలనే ఆతృతతో అర్దరాత్రి దాటిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో నియంత్రించడం సిబ్బంది వల్ల కాలేదు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చక్కర్లు కొడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సోమవారం (నిన్న) జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి భక్తులు రాములోరిని దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనుమతి ఇచ్చారు. అందుకే భారీగా భక్తులు తరలివచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 23 , 2024 | 09:18 AM