మనాలీపై మంచు దుప్పటి
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:29 AM
హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రహదారులపై అర అడుగు నుంచి ఒక అడుగు మేర మంచు గడ్డకట్టింది
మనాలీ, డిసెంబరు 24: హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీని మంచు దుప్పటి కప్పేసింది. రహదారులపై అర అడుగు నుంచి ఒక అడుగు మేర మంచు గడ్డకట్టింది. దీంతో.. సోలాంగ్-రొహతంగ్ రహదారిపై వెయ్యికి పైగా వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. 700 మందికి పైగా పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెహ్రూకుండ్ నుంచి సోలాంగ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా అటల్ టన్నెల్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. ఆ మార్గంలో వాహనాలను అనుమతించడం లేదు. డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో మనాలీకి పర్యాటకులు పోటెత్తుతారు. ఈ సీజన్‌లో పర్వతాలు, కొండలు, లోయలను మంచు కప్పేసి.. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే.. సోమవారం నుంచి భారీగా మంచు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. కోట్టైలో 48, రోహ్రూలో 27 ప్రధాన రహదారులు మంచుతో నిండిపోయి, రాకపోకలు జరగడం లేదు.
Updated Date - Dec 25 , 2024 | 04:29 AM