Hemant Soren: జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మళ్లీ పగ్గాలు?
ABN, Publish Date - Jul 03 , 2024 | 05:36 PM
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.
రాంచీ: జార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్‌కు జార్ఖాండ్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో జూన్ 28న ఆయన బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టుకు ముందు జనవరి 31న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ జూలై 12 వరకూ పొడిగింపు
జేఎంఎం వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి చంపయి సోరెన్ నివాసంలో హేమంత్ సోరెన్‌ను జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి జేఎంఎం ఎమ్మెల్యేలతో పాటు కూటమి ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ జార్ఖాండ్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, హేమంత్ సోరెన్ సోదరుడు బసత్, భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంపయి సోరెన్ స్థానంలో తిరిగి హేమంత్ సోరెన్‌ను సీఎం పగ్గాలు అప్పగించాలని కూడా సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇదే జరిగితే, 2020 నవంబర్ 15న బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖాండ్ ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సోరెన్ పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 03 , 2024 | 08:32 PM