Jharkhand Assembly Results: హేమంత్ సోరెన్‌కే మళ్లీ సీఎం పీఠం.. బీజేపీ ఆశలకు 'ఇండియా' కూటమి గండి
ABN, Publish Date - Nov 23 , 2024 | 03:19 PM
గిరిజనుల ఉనికి, చొరబాట్లు, లవ్ జీహాద్ వంటి కీలకాంశాలతో బీజేపీ మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించినా 'ఇండియా' కూటమి సమర్ధవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్టు ఫలితాలు సూచిస్తు్న్నాయి.
న్యూఢిల్లీ: జార్ఖాండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా జేఎంఎం-కాంగ్రెస్ కూటమిపై విజయం సాధించాలనే బీజేపీ ఆశలకు గండిపడింది. జేఎంఎం సారథ్యంలోని 'ఇండియా' కూటమికి సంపూర్ణ ఆధిక్యం కట్టబెట్టే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. దీంతో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ (Hemant Soren) వరుసగా రెండోసారి జార్ఖాండ్ సీఎంగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. గిరిజనుల ఉనికి, చొరబాట్లు, లవ్ జీహాద్ వంటి కీలకాంశాలతో బీజేపీ మునుపెన్నడూ లేనంత విస్తృత ప్రచారం సాగించినా 'ఇండియా' కూటమి సమర్ధవంతంగా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టినట్టు ఫలితాలు సూచిస్తు్న్నాయి.
Maharashtra Results: 'మహా' త్రయానికి అమిత్‌షా అభినందనలు
ఈసీ వెబ్‌సైట్ ట్రెండ్స్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటల వరకూ 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం కూటమి 51 స్థానాల్లోనూ, ఎన్డీయే కూటమి 29 స్థానాల్లోనూ ఆధిక్యం కొనసాగించాయి. బర్హయిత్ అసెంబ్లీ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్ 17,347 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయన భార్య కల్పనా సోరెన్ తొలుత వెనుకబడినా విజయం వైపు దూసుకు వెళ్తున్నారు. జేఎంఎం కూటమి అభివృద్ధి కూటమికి ప్రజలు తిరిగి పట్టం కట్టారని కల్పనా సోరెన్ ఓ వైపు ఫలితాలు వెలువడుతుండగా స్పందించారు.
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, మధ్యాహ్నం 4 గంటల కల్లా కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయని చీఫ్ ఎలక్టోరల్ అధికారి కె.రవికుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 23 , 2024 | 03:19 PM