ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chattisgarh: నివురుగప్పిన నిప్పులా దండకారణ్యం

ABN, Publish Date - Apr 04 , 2024 | 09:20 AM

ఛత్తీస్‌గడ్ దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది. బీజాపూర్ ఎన్ కౌంటర్ మృతుల్లో ఐదుగురిని గుర్తించారు. మిగతా 8 మంది గుర్తింపు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్చోలి ఎన్ కౌంటర్‌పై మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేయలేదు. వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి.

ఛత్తీస్‌గడ్: ఛత్తీస్‌గడ్ (Chattisgarh) దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది. బీజాపూర్ ఎన్ కౌంటర్ మృతుల్లో ఐదుగురిని గుర్తించారు. మిగతా 8 మంది గుర్తింపు కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్చోలి ఎన్ కౌంటర్‌పై మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేయలేదు. వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్ట్‌ల వద్ద విదేశీ ఆయుధాలు ఉండటంపై డిప్యూటీ సీఎం విజయ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు సిద్ధమంటూ దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ఫ్ లేఖపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు. వేసవి ముగిసేలోగా ఆపరేషన్ అబూజ్ మడ్ టార్గెట్‌గా భద్రతా బలగాలు కదులుతున్నాయి.

రాజ్యాంగ నాశనానికి మోదీ యత్నం

బీజాపూర్ ఎన్ కౌంటర్ ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ..ఛత్తీస్ గడ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. చర్ల మండలం సరిహద్దులో భారీగా కూంబింగ్ ఏర్పాటు చేశారు. ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. మంగళవారం సాయంత్రానికి 11 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమవ్వగా.. బుధవారం ఉదయం మరో రెండు మృతదేమాలను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. 13 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బీజాపూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంగలూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని లేంద్ర-కొర్చోలి అటవీప్రాంతంలో మంగళవారం పోలీసులు-నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. మృతులంతా పీఎల్‌జీఏ రెండో కంపెనీకి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు.

ఆప్‌ను నేలమట్టం చేసే కుట్ర

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 04 , 2024 | 09:34 AM

Advertising
Advertising