ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gyanvapi: జ్ఞానవాపిలో హిందువులు పూజ చేసుకోవచ్చు, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ABN, Publish Date - Feb 26 , 2024 | 10:35 AM

జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

వారణాసి: జ్ఞానవాపి (Gyanvapi) మసీదు లోపల ఉన్న వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవచ్చని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాస్ కా టెఖనా వద్ద హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని ఇటీవల వారణాసి సెషన్స్ జడ్జి అనుమతిచ్చారు. దానిని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో ( Allahabad High Court) సవాల్ చేసింది. పిటిషన్‌పై ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి. అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ రంజన్ ఈ రోజు తీర్పు ఇచ్చారు.

జ్ఞానవాపి వివాదం నేపథ్యంలో 1993 నుంచి హిందువుల పూజలు నిలిచిపోయాయి. ఇటీవల వారణాసి కోర్టు తీర్పు ఇవ్వడంతో పూజలు ప్రారంభించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. పూజ క్రతువుల కోసం ఆర్చకుడిని నియమించాలని కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్‌కు వారణాసి జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణం దక్షిణ భాగంలో వ్యాస్ కా టెఖనా ఉంది. ఆ నేలమాలిగ వద్ద మహా శివుడు కొలువై ఉన్నారు. భక్తులు పూజలు చేయడం ప్రారంభించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 11:07 AM

Advertising
Advertising