Lawrence Bishnoi: జైలులోంచి ఎలా బెదిరిస్తాను: లారెన్స్ బిష్ణోయ్
ABN, Publish Date - Dec 07 , 2024 | 07:07 PM
2017 మార్చి 4న ఇద్దరు యువకులు ప్రముఖ వ్యాపారవేత మనీష్ జైన్ కార్యాలయానికి వచ్చి అతని కాల్చిచంపేందుకు ప్రయత్నించారు. అయితే రివాల్వర్‌లోనే బుల్లెట్ ఉండిపోవడంతో మనీష్ జైన్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జైపూర్: గ్లోబల్ క్రిమినల్ సిండికేట్ నడుపుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చాడు. తాను జైలులో ఉండగా ఎలా బెదిరించడం సాధ్యమని ప్రశ్నించాడు. ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్న బిష్ణోయ్‌ను చీఫ్ మెట్రోపాలిటిన్ నెంబర్ 7 కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారంనాడు హాజరుపరిచగా, ఆయన వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. తనపై నమోదైన అభియోగాలన్నీ తప్పని పేర్కొన్నాడు. 2017లో బెదిరించి సొమ్ములు వసూలుకు పాల్పడ్డారన్న కేసులో ఆయన తాజా వాంగ్మూలం ఇచ్చారు.
Bomb Threat: మోదీని చంపుతామంటూ ముంబై పోలీసులకు బెదిరింపు మెసేజ్
కేసు ఏమిటి?
2017 మార్చి 4న ఇద్దరు యువకులు ప్రముఖ వ్యాపారవేత మనీష్ జైన్ కార్యాలయానికి వచ్చి అతని కాల్చిచంపేందుకు ప్రయత్నించారు. అయితే రివాల్వర్‌లోనే బుల్లెట్ ఉండిపోవడంతో మనీష్ జైన్ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను చంపేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ఇంటర్నెట్ కాల్ వచ్చిందని, అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజాగా ఈ కేసులో బిష్ణోయ్ తన వాంగూల్మం ఇస్తూ, గత 11 ఏళ్లుగా తాను జైలులోనే ఉన్నానని, జైలు నుంచి తాను ఎవరికైనా ఫోను చేసి బెదిరించడం ఆసాధ్యమని చెప్పారు. తనపై ఒత్తిడి పెంచేందుకు, భయపెట్టేందుకు పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని, తనపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కోర్టుకు విన్నవించారు.
ఇవి కూడా చదవండి...
Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య
Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 07 , 2024 | 07:07 PM