Share News

ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:05 AM

ఈ భూమ్మీద తనకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరని బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్‌ తయారు

ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే

బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్‌ యోగిరాజ్‌

అయోధ్య, జనవరి 22: ఈ భూమ్మీద తనకంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరని బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్‌ తయారు చేసిన విగ్రహం అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠాపనకు ఎంపికైంది. విగ్రహంలో రామ్‌లల్లా కమలంపై నిలబడిన ఐదేళ్ల చిన్నారిగా దర్శనమిచ్చాడు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా యోగిరాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే. ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. ఇదంతా తలచుకుంటుంటే కొన్నిసార్లు కలల ప్రపంచంలో ఉన్నానేమో అనిపిస్తుంది’’ అంటూ అమితానందం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 23 , 2024 | 04:05 AM