Daughters Beating Father : తల్లి కళ్లెదుటే.. తండ్రిని కర్రలతో చావబాదిన కూతుళ్లు.. వీడియో బయటికి రావడంతో..
ABN , Publish Date - Mar 10 , 2025 | 05:03 PM
Daughters Beating Father Viral Video : మంచం మీద పడుకున్న తండ్రిని ఇద్దరు కూతుళ్లు కిరాతకంగా కర్రలతో చావగొడుతుంటే.. వారికి తల్లి వత్తాసు పలుకుతూ ప్రోత్సహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లో భార్యా, పిల్లలు కలిసి ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు కొట్టారనే ప్రశ్నలకు సమాధానంగా..

Daughters Beating Father Viral Video : మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక తండ్రి ఈ నెలలోనే ఇద్దరు కుమార్తెలకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. కూతుళ్లు వెళ్లిపోయాక భార్య కూడా శాశ్వతంగా పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఇది జరిగిన రెండు రోజులకే ఇంట్లో అనుమానస్పద స్థితితో విగతజీవిగా కనిపించాడు ఆ వ్యక్తి. అయితే, అతడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నతర్వాత,ఇద్దరు కుమార్తెలు కలిసి తండ్రిని కర్రలతో కొడుతుండగా, తల్లి భర్తను గట్టిగా పట్టుకుని కొట్టమని చెబుతున్నట్లు కనిపించే ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. మాకేం సంబంధం లేదని తల్లీ, కుమార్తెలు వాదిస్తుండగా.. వీరే హత్య చేశారని బాధితుడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.
కూతుళ్లు వెళ్లిన రెండ్రోజులకే..
మధ్యప్రదేశ్‌లోని మొరెనా సిటీ కొత్వాలి ప్రాంతంలో నివసించే హరేంద్ర మౌర్య ఒక ఎలక్ట్రికల్ మెకానిక్. హరేంద్రకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హరేంద్ర, అతడి భార్య తరచుగా గొడవ పడుతుండేవారు.ఇదిలా ఉంటే ఇటీవల మార్చి 1న హరేంద్ర తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. మార్చి 8 (శనివారం) ఉదయం ఇద్దరు కుమార్తెలను అత్తారింటికి పంపించాడు. ఆ సాయంత్రమే భార్య కూడా పుట్టింట్లోనే శాశ్వతంగా నివసిస్తానని హరేంద్రతో తెగేసి చెప్పింది. ఈ బాధతో హరేంద్ర ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకుని ఎంతసేపటికీ బయటికీ రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఏదో జరిగిందని అనుమానించి తలుపు పగలగొట్టి చూడగా.. హరేంద్ర ఉరివేసుకుని కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు కాపాడలేకపోయారు.
కర్రలతో కొడుతుండగా..
హరేంద్ర ఆత్మహత్య చేసుకునే ముందే అతడి భార్య హరేంద్ర కాళ్లు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉండగా ఇద్దరు కుమార్తెలు కర్రలతో కొడుతున్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి కూడా వచ్చింది.ఇంతలోనే హరేంద్ర తరపు బంధువులు అతడి భార్యే ఈ హత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు.
రెండు కోణాల్లో దర్యాప్తు..
ప్రస్తుతం ఈ వీడియో ఎప్పటిదో ఇంకా తెలియరాలేదు. కానీ, ఈ వ్యక్తి మృతి అనుమానాస్పదంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులు గ్వాలియర్ మెడికల్ కాలేజీ వైద్య బృందంతో హరేంద్ర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.
Read Also : Hyderabad: యాప్రాల్‌లో తల్లి.. లాలాగూడలో కూతురు.. ఏం జరిగిందంటే..
Cyber crime: నకిలీ వివరాలతో బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి..
Viral Video: షాకింగ్ వీడియో.. రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొన్న కార్.. స్పాట్‌లో మరణించిన బైకర్..