Ayodhya: బాబ్రీని వదులుకున్నాం.. జ్ఞానవాపీని వదులుకోం.. ఐఎంసీ చీఫ్ స్ట్రాంగ్ కామెంట్స్..
ABN, Publish Date - Jan 05 , 2024 | 11:09 AM
ఓ వైపు శరవేగంగా సాగుతున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పనులు.. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతున్నాయి
ఓ వైపు శరవేగంగా సాగుతున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ పనులు.. మరోవైపు కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న శ్రీరాముడు మాంసాహారి అని విమర్శలు చేయగా ఇప్పుడు మరో నేత బాబ్రీ మసీదును వదులుకున్నాం కానీ జ్ఞానవాపిని వదులుకునేది లేదని సంచలన కామెంట్లు చేసారు. ఐఎంసీ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్.. బాబ్రీ మసీదుపై నిర్ణయాన్ని అంగీకరించి ఇచ్చేశామని కానీ ఇప్పుడు జ్ఞానవాపీ మసీదును వదులుకునేది లేదని ఘాటు వ్యాఖ్యలుచేశారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా నరేంద్ర మోదీ పనిచేశారన్నారు.
దేశానికి ఈ ప్రభుత్వం చేసినంత నష్టం మరే ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. బాబ్రీ కోసం ఓపిక పట్టామని, కానీ ఇప్పుడు మన కోసం ఓపిక పట్టాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. మథురలోని జ్ఞానవాపీ మసీదు, ఈద్గాలకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. మసీదుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కాగా.. ఇంతకుముందు కూడా బాబ్రీ, జ్ఞానవాపీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై మౌలానా తౌకీర్ రజా రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. 2023 డిసెంబరులో.. దేశంలో శాంతి కోసం బాబ్రీపై అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాన్ని అంగీకరించి వదులుకున్నామన్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Updated Date - Jan 05 , 2024 | 11:09 AM