ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Imphal : మళ్లీ భగ్గుమన్న మణిపూర్‌!

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:24 AM

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్‌, డ్రోన్‌ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్‌ నెలకొంది.

  • దాడులు, ఘర్షణల్లో ఆరుగురి మృతి

  • గవర్నర్‌ను కలిసిన సీఎం బీరేన్‌ సింగ్‌

  • రాష్ట్ర సర్కారుకు తగిన అధికారాలు

  • ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

  • దాడులు, ఘర్షణల్లో ఆరుగురి మృతి

ఇంఫాల్‌, సెప్టెంబరు 8: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ-మైతేయి వర్గాల మధ్య ఘర్షణలతో గతేడాది అట్టుడికిన ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అగ్గి రాజుకుంది. రాకెట్‌, డ్రోన్‌ బాంబు దాడులతో ఈసారి మరింత హైటెన్షన్‌ నెలకొంది. శనివారం జిరిబామ్‌ జిల్లాలో ఓ ఇంట్లోకి చొరబడిన అనుమానిత కుకీ సాయుధులు నిద్రిస్తున్న వ్యక్తిని కాల్చి చంపగా.. ఇది కాస్త ఇరు వర్గాల ఘర్షణకు దారి తీసింది. అనంతరం జరిగిన దాడుల్లో మరో నలుగురు సాయుధులు చనిపోయారు. అంతకుముందు రోజే జరిగిన రాకెట్‌ దాడుల్లో బిష్ణుపూర్‌ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. డ్రోన్లను తిప్పకొట్టడానికి యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌లతో మోహరించారు. కాగా, ఘర్షణల నేపథ్యంలో సీఎం బీరేన్‌ సింగ్‌ పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ స్పీకర్‌తో కలిసి గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తగిన అధికారాలివ్వాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది. కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వంతో రెండు కుకీ తీవ్రవాద సంస్థల మధ్య జరిగిన సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని సీఎం కోరినట్లు సమాచారం.

Updated Date - Sep 09 , 2024 | 03:24 AM

Advertising
Advertising