యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్..బాలుడి మృతి
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:23 AM
బిహార్‌లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్ చేసి 15 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. బిహార్‌లోని సరన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పట్నా, సెప్టెంబరు 8: బిహార్‌లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్ చేసి 15 ఏళ్ల బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. బిహార్‌లోని సరన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ పట్టణంలోని కృష్ణ కుమార్ అనే బాలుడికి వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ‘గణపతి సేవా సదన్ హాస్పిటల్’కు తీసుకెళ్లారు. కొద్ది సేపటికి వాంతులు తగ్గాయి. కానీ ‘వైద్యుడు’ అజిత్ కుమార్ పురీ మాత్రం ఆ బాలుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని, వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పాడు. ఆ బాలుని తండ్రిని పంపించివేసి, యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు. బాలుడి పరిస్థితి విషమించడంతో.. వెంటనే పట్నా వెళ్లాలని అంబులెన్స్‌ను పిలిపించాడు. మార్గమఽధ్యలోనే బాలుడు చనిపోయాడు.
Updated Date - Sep 09 , 2024 | 04:23 AM