ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు

ABN, Publish Date - Jun 02 , 2024 | 07:12 PM

ఓట్ల లెక్కింపు ముందు 150 జిల్లాల మేజిస్ట్రేట్లలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి సైతం ఆయన తీసుకు వెళ్లారు.

న్యూఢిల్లీ, జూన్ 02: ఓట్ల లెక్కింపు ముందు 150 జిల్లాల మేజిస్ట్రేట్లలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి సైతం ఆయన తీసుకు వెళ్లారు. దీంతో ఈసీ సైతం స్పందించింది. ఈ ఆరోపణలపై మీ వద్ద ఏమైనా ఆధారాలుంటే తమకు ఆదివారం సాయంత్రం లోపు సమర్పించాలని జైరాం రమేష్‌కు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.


అలాంటి వేళ ఇండియా కూటమిలోని పలువురు కీలక నేతలు ఆదివారం మధ్యాహ్నం ఈసీని కలిసి కొన్ని ఫిర్యాదులు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా ఈసీ నియమ నిబంధనలకు లోబడి జరగాలన్నారు. అంటే సీసీ టీవీ పర్యవేక్షణలో జరగాలన్నారు. అలాగే కంట్రోల్ యూనిట్‌ను వేరిఫికేషన్ సైతం జరపాలని చెప్పారు. ఇక ఈవీఎంలో డేటా వస్తుందా? లేదో సరి చూసుకోవాల్సి ఉందన్నారు. అదే విధంగా ఈవీఎంలకు సీల్ ఉందా? అనే అంశాన్ని సైతం కౌంటింగ్ ఏజెంట్ల ముందు పరిశీలించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.

Also Read: Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్


Also Read: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు

ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఈసీని కోరినట్లు తెలిపారు. అయితే అధికారుల నుంచి తమకు సంతృప్తికరమైన సమాధానం వచ్చిందన్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించి.. వాటి ఫలితాలను ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సంఘ్వీ తెలిపారు. అయితే ఈ పద్దతిని ఈసీ చాలా కాలంగా అనుసరిస్తుందన్నారు. కానీ ఈవీఎంలను లెక్కించే ముందు పోస్టల్ బ్యాలెట్ పలితాలు ప్రకటించ వద్దని ఎన్నికల సంఘాన్ని కలిసి కోరినట్లు అభిషేక్ సింఘ్వీ వెల్లడించారు. ఈ ఎన్నికలు ప్రారంభమైన అనంతరం ఈసీని ఇండియా కూటమి నేతలు మూడోసారి భేటీ కావడం గమనార్హం.

Also Read: Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 07:13 PM

Advertising
Advertising