కెనడాలో ముగ్గురు విద్యార్థుల హత్యపై భారత్ ఆందోళన
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:03 AM
కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్యపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 13: కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్యపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ఆవేదనను కెనడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం, వాంకోవర్, టొరాంటోల్లోని కాన్సులేట్ కార్యాలయాలు సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమగ్రమైన దర్యాప్తు జరిగేలా స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. కెనడాలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని భారతీయ విద్యార్థులకు సూచించారు. కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా మంజూరులో భారత రాయబార కార్యాలయం ఆలస్యం చేస్తోందన్న వార్తలపై ఆయన స్పందించారు. ఇది కెనడా మీడియా చేస్తున్న దుష్ప్రచారమన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 04:03 AM