ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది

ABN, Publish Date - Dec 01 , 2024 | 07:17 PM

రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే, ఆలుగడ్డలు, ఉల్లి ధరలు 50 శాతం పెరిగాయని, రూపాయి విలువ 84.50కు పడిపోయిందని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పటికే 45 సంవత్సరాల కంటే అధిక నిరుద్యోగిత స్థాయిని నమోదు చేసిందని చెప్పారు.

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలో కొద్ది మంది బిలియనీర్లు మాత్రమే లబ్ధి పొందుతున్న వరకూ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి ఉండదని ట్వీట్ చేశారు. రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజానీకం, పేదలు ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే ఉన్నారని రాసుకొచ్చారు.

Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత


రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగిందని, గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే, ఆలుగడ్డలు, ఉల్లి ధరలు 50 శాతం పెరిగాయని, రూపాయి విలువ 84.50కు పడిపోయిందని అన్నారు. నిరుద్యోగం ఇప్పటికే 45 సంవత్సరాల కంటే అధిక నిరుద్యోగిత స్థాయిని నమోదు చేసిందని చెప్పారు. ఈ గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. గత ఐదేళ్లలో కార్మికులు, ఉద్యోగులు, చిన్నవ్యాపారుల ఆదాయం నిలిచిపోవడం, గణనీయంగా తగ్గపోవడం జరిందన్నారు.


ఆదాయం తగ్గడంతో డిమాండ్ కూడా తగ్గిందని, రూ.10 లక్షల కంటే తక్కువ ధరల కార్ల షేర్లు 2019లో 80 శాతం ఉండగా ఇప్పుడు 50 శాతం కంటే తగ్గిపోయిందని రాహుల్ వివరించారు. తక్కువ ధరల ఇళ్ల మొత్తం అమ్మకాల వాటా గత ఏడాది 38 శాతం ఉండగా, అది ఇప్పుడు 22 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల డిమాండ్ ఇప్పటికే తగ్గిందని, కార్పొరేట్ పన్ను షేర్ గత పదేళ్లలో 7 శాతం తగ్గిందని వివరించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా 50 సంవత్సరాలలో కనిష్టంగా 13 శాతానికి పడిపోయిందని, ఆ పరిస్థితిలో కొద్ది ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని రాహుల్ ప్రశ్నించారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచన అవసరమని, వ్యాపారాల కోసం కొత్త ఒప్పందాలు ముఖ్యమని, అందరికీ సమానావకాశాలు కల్పించినప్పుడే దేశ ఆర్థిక చక్రాలు ముందుకు వెళ్తాయని రాహుల్ తన ట్వీట్‌లో సూచించారు.


ఇవి కూడా చదవండి

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..

Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 07:19 PM