ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pension Scheme: పాత-కొత్త కలయికే ఏకీకృత పింఛన్‌

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:22 AM

ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు తమకు పాత పెన్షన్‌ విధానమే కావాలని ఆందోళనలు చేస్తున్నాయి. అందుక్కారణం.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండానే భవిష్యత్‌కు ఓపీఎస్‌ విధానం భద్రత కల్పిస్తుండడమే..! అంతేకాకుండా..

  • సీపీఎస్‌ కంటే ప్రయోజనాలు ఎక్కువే

  • రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి

  • యూపీఎస్‌, ఎన్‌పీఎస్‌, ఓపీఎస్‌లో తేడాలెన్నో!

పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్‌ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కొత్త(జాతీయ) పెన్షన్‌ విధానం(ఎన్‌పీఎస్‌) స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించకుండా.. ఏకీకృత పింఛన్‌ పథకాన్ని(యూపీఎస్‌) తీసుకువచ్చేందుకు కేంద్ర క్యాబినెట్‌ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే..! ఈ పింఛన్‌ పథకాల మధ్య తేడాలేమిటి? ఏది మంచిది? యూపీఎస్‌ నిజంగానే ఉద్యోగుల భవిష్యత్‌కు భద్రత కల్పిస్తుందా?


పాత పెన్షన్‌ పథకం

  • ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు తమకు పాత పెన్షన్‌ విధానమే కావాలని ఆందోళనలు చేస్తున్నాయి. అందుక్కారణం.. ఉద్యోగిపై ఎలాంటి భారం లేకుండానే భవిష్యత్‌కు ఓపీఎస్‌ విధానం భద్రత కల్పిస్తుండడమే..! అంతేకాకుండా.. ఒకవేళ పెన్షన్‌దారుడు మరణిస్తే.. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఎలాంటి కోత లేకుండా.. పూర్తి పెన్షన్‌ రావడమే.

  • ఈ విధానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు అమలయ్యేది. పెన్షన్‌ పథకం కోసం ఉద్యోగి జీతంలో ఎలాంటి కోతలు ఉండేవి కాదు. ఈ విధానంలో ఒక ఉద్యోగి రిటైర్‌ అయ్యే సమయానికి చివరి నెలలో తీసుకున్న బేసిక్‌ వేతనంలో 50శాతాన్ని నెలసరి పింఛన్‌గా నిర్ధారించేవారు.

  • దీంతోపాటు.. కరువు భత్యం(డీఏ) ఉండేది. అంటే.. ప్రభుత్వోద్యోగులకు ఎప్పుడు డీఏ పెరిగినా.. అది పెన్షనర్లకు కరువు ఉపశమనం(డీఆర్‌)గా వర్తించేది. వేతన సవరణ కమిషన్‌(పీఆర్సీ) సిఫారసులు కూడా అమలయ్యేవి.

  • ఈ విధానంలో పెన్షన్‌ మొత్తం క్రమంగా పెరిగే అవకాశాలుండేవి. డీఏ, పీఆర్సీ ఎంత శాతం పెరిగితే.. పింఛన్‌ మొత్తం కూడా అంతే శాతం పెరిగేది. ఈ పథకానికి అనుబంధంగా సాధారణ భవిష్య నిధి(జీపీఎఫ్‌) వంటివి పదవీ విరమణ ప్రయోజనాలుగా ఉండేవి.

  • పాత పెన్షన్‌ విధానంలో ఓ ఉద్యోగి రిటైర్‌ అయ్యాక రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీ వచ్చేది.

  • ఓపీఎస్‌ అనేది ప్రభుత్వ ఖజానా నుంచి అందేది. ఒకవేళ పెన్షనర్‌ చనిపోతే.. అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయిలో పింఛన్‌ ప్రయోజనాలు అందేవి. పాత పెన్షన్‌ విధానంలో ఇంటి నిర్మాణానికి, పిల్లల పెళ్లిళ్లకు పీఎఫ్‌ నుంచి విత్‌డ్రాకు వెసులుబాటు ఉండేది


జాతీయ పెన్షన్‌ పథకం

  • అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగి వేతనంలోంచి నెలనెలా కొంతమొత్తం వెచ్చించడం.. చివరకు వచ్చే పెన్షన్‌ చాలా తక్కువగా.. కొన్ని సందర్భాల్లో వితంతు, వృద్ధాప్య పింఛన్ల కంటే హీనంగా ఉండడమే కారణం.

  • ఈ పెన్షన్‌ స్కీమ్‌ను కేంద్రంలో జాతీయ పింఛన్‌ పథకం(ఎన్‌పీఎ్‌స)గా.. రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స)గా అమలు చేస్తున్నారు.

  • ఈ విధానంలో మూలవేతనం, డీఏను కలిపి.. దానిపై 10ు ఉద్యోగి, 10ు ప్రభుత్వం నెలనెలా జమచేయాలి. ఈ మొత్తాన్ని 100ు ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్‌ఐసీ షేర్లలో పెట్టేవారు. షేర్‌ విలువను బట్టి పెన్షన్‌లో రిటర్న్స్‌ చేరేవి.

  • రిటైర్‌ అయ్యాక.. పొదుపు చేసిన దాంట్లో 60ు లంప్సమ్‌గా ఇస్తారు. మిగతా దాంట్లో 40శాతాన్ని నెలవారీగా సమాన విలువగట్టి పింఛన్‌గా అందజేస్తారు. అంటే.. తీసుకునే జీతానికి.. చివరి బేసిక్‌ పేతో పోలిస్తే.. ఈ పింఛన్‌ చాలా తక్కువ. సర్వీసును బట్టి.. కొన్ని సందర్భాల్లో రూ.2వేలు.. అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు.


ఏకీకృత పెన్షన్‌ పథకం

  • ఈ విధానం ఓపీఎస్‌, ఎన్‌పీఎ్‌స/సీపీఎ్‌సల కలయికగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్‌పీఎ్‌సతో పోలిస్తే.. యూపీఎస్‌ విధానం ఉద్యోగులకు పింఛన్‌ హామీని పెంచుతూ.. గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలకు భరోసా ఇవ్వనుంది.

  • కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్‌ అయ్యేవారికి పదవీ విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్‌ పే+డీఏ మొత్తం సగటులో 50ు పింఛన్‌గా వస్తుంది.

  • కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్‌ అయ్యేవారికి వారి సర్వీసు కాలాన్ని బట్టి పింఛన్‌ వస్తుంది. ఇది 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారితో పోలిస్తే.. తక్కువగా ఉంటుంది. అంటే.. పింఛన్‌ హామీ కనీసం రూ.10 వేలుగా ఉంటుంది.

  • ఉద్యోగి మరణిస్తే.. పింఛన్‌లో 60ు ఆయన/ఆమె కుటుంబ సభ్యులకు నెలవారీ పింఛన్‌గా అందుతుం ది. డీఆర్‌ కూడా లభిస్తుంది. ఉద్యోగి రిటైర్‌ అయ్యాక గ్రాట్యుటీతోపాటు అదనపు ప్రయోజనాలుంటాయి.


మూడు పింఛన్‌ విధానాల్లో తేడాలివే!

ప్రయోజనం ఓపీఎస్‌ సీపీఎస్‌/ఎన్‌పీఎస్‌ యూపీఎస్‌

ఉద్యోగి వాటా లేదు బేసిక్‌+డీఏపై 10% బేసిక్‌+డీఏపై 10%

షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు లేదు ఉంది ప్రభుత్వమే భరిస్తుంది

గ్రాట్యుటీ ఉంది ఉంది ఉంది

పథకం మార్పిడి ఉంది లేదు ఉంది

పెన్షన్‌ చివరి బేసిక్‌

+డీఏపై 50% మూలధనంలో చివరి 12 నెలల

40ులో వాటాలుగా.. బేసిక్‌+డీఏ సగటుపై50%

పీఆర్సీ ఉంది లేదు లేదు

అదనపు పెన్షన్‌ ఉంది లేదు స్పష్టత రావాల్సి ఉంది

కుటుంబ పెన్షన్‌ ఉంది ఐచ్ఛికం 60% ఉంటుంది

కరువు ఉపశమనం(డీఆర్‌) ఉంది లేదు ఉంది

హెల్త్‌ కార్డులు ఉన్నాయి లేవు స్పష్టత లేదు

కారుణ్య నియామకం ఉంది ఉంది ఉంది

రిటైర్‌మెంట్‌ లంప్సమ్‌ పీఎఫ్‌ 100% ఎన్‌పీఎస్‌లో 60% స్పష్టత రావాల్సి ఉంది

విధి నిర్వహణలో మరణించిన ఉంటుంది ఉంటుంది ఉంటుంది

వారి కుటుంబాలకు పెన్షన్‌

Updated Date - Aug 26 , 2024 | 05:22 AM

Advertising
Advertising
<