Delhi: బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై ఎంఈపీ ఎత్తివేత
ABN, Publish Date - Oct 24 , 2024 | 04:39 AM
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే బాస్మతియేతర తెల్లబియ్యానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం టన్నుకు రూ.41,198 రుసుం
ఎత్తివేతతో పెరగనున్నఎగుమతులు
న్యూఢిల్లీ, అక్టోబరు 23: భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే బాస్మతియేతర తెల్లబియ్యానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బియ్యాన్ని ఎగుమతి చేసే విషయంలో టన్నుకు 490 డాలర్ల (రూ.41,198) చొప్పున ఇప్పటివరకు అమల్లో ఉన్న కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను ఎత్తివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వాస్తవానికి గత ఏడాది దేశంలో బియ్యం కొరత ఏర్పడటంతో 2023 జూలై 20న బాస్మతియేతర తెల్లబియ్యం ఎగుమతులపైనే ప్రభుత్వం నిషేధం వి ధించింది.
ఈ నిషేధాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 28న ఎత్తివేస్తూ.. కనీస ఎగుమతి ధరను నిర్ణయించింది. తాజాగా ఈ బియ్యం ఎగుమతులను పెంచే దిశగా ఎంఈపీని కూడా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎ్‌ఫటీ) నోటిఫికేషన్ విడుదల చేశారు.
Updated Date - Oct 24 , 2024 | 04:39 AM