ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:31 PM

మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.

న్యూఢిల్లీ, జూన్ 25: మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభంకానుంది. ముంబై - న్యూఢిల్లీ మధ్య ఈ రైలు నడవనుంది. బెంగుళూరులో ఈ రైలు తయారీ తుది దశకు చేరుకుంది. మొత్తం 16 కోచ్‌లుండే ఈ రైలులో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒకటి మాత్రం ఫస్ట్ ఏసీ కోచ్‌లతో పాటు సీటింగ్‌ కమ్ లగేజ్ ర్యాక్ కోచ్‌లు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: CM Tour: కుప్పంలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం


ముంబై - న్యూఢిల్లీ మధ్య నడిచే రైళ్లకు ప్రయాణికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ క్రమంలో ప్రయాణికులు రిజర్వేషన్ లేకుండా రైళ్లలో ప్రయాణించే సందర్భాలు సైతం అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ రైలు‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ స్లీపర్ రైలు బాగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

Also Read: Delhi Water Crisis: అమరణ నిరాహార దీక్ష విరమించిన మంత్రి అతిషి


న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు భోపాల్, సూరత్ మీదగా ముంబై చేరుకుంటుందని వివరించింది. మరోవైపు వందేభారత్ స్లీపర్ రైలు మరో రెండు నెలల్లో పట్టాలెక్కనుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రైలు తయారీపై ఇటీవల బెంగుళూరులో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నతాధికారులతో సమీక్ష సైతం నిర్వహించారు.

Also Read: Rail Roko: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట

For Latest News and National News click here

Updated Date - Jun 25 , 2024 | 03:39 PM

Advertising
Advertising