ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Agni-Prime: అగ్ని-ప్రైమ్.. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్.. దీని వివరాలేంటంటే?

ABN, Publish Date - Apr 04 , 2024 | 04:59 PM

చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్‌ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది.

చైనాతో సరిహద్దు వివాదం, ఇతర శత్రు దేశాల నుంచి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండొచ్చన్న ఉద్దేశంతో.. భారత ప్రభుత్వం రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. యుద్ధ వాహనాలు, సరికొత్త బాలిస్టిక్ క్షిపణులను సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న మిస్సైల్స్‌ని ఆధునికత ఆధారంగా మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-ప్రైమ్’ను (Agni-Prime) ప్రయోగించగా, ఇది విజయవంతం అయ్యింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీనిని పరీక్షించారు. బుధవారం సాయంత్రం ఈ టెస్ట్-ఫ్లైట్ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ ప్రదేశాల్లో మోహరించిన అనేక శ్రేణి సెన్సార్ల డేటా ఆధారంగా.. ఈ క్షిపణి దానికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను పూర్తి చేసిందని రక్షణ శాఖ పేర్కొంది.

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ..


‘‘స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (SFC), డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో కలిసి ఏప్రిల్ 3వ తేదీన బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో.. ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని-ప్రైమ్ ఫ్లైట్-టెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది’’ అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, DRDO, ఇండియన్ ఆర్మీ సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. ఈ అగ్ని-ప్రైమ్ పరీక్ష విజయవంతం అవ్వడంతో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) డీఆర్డీఓ, ఎస్ఎఫ్‌సీ, సాయుధ దళాలను అభినందించారు. ఇది సాయుధ దళాలకు అద్భుతమైన బలాన్ని అందించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన శక్తిని అందిస్తుందని భావిస్తున్నారు.

అగ్ని-ప్రైమ్

ఇది కొత్త తరం అణు సామర్థ్యం గల మధ్యస్థ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అగ్ని సిరీస్‌లో భాగంగా.. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఆరో మిసైల్ ఇది. 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల శ్రేణి సామర్థ్యం కలిగిన ఈ మిసైల్.. అగ్ని-IV, అగ్ని-Vల సాంకేతిక పురోగతిని సైతం కలిగి ఉంది. రక్షణ శాఖ ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగమైన ఈ మిసైల్‌ని.. ఆధునికత ఆధారంగా మరింత తీర్చిదిద్దింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 05:05 PM

Advertising
Advertising