ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special Trains: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Oct 15 , 2024 | 04:44 PM

దీపావళి, చాత్ పూజ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దీపావళి, చాత్ పూజ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే మంగళవారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు మళ్లీ స్వస్థలాలకు చేరేందుకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడతాయని తెలిపింది.

Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?


ఎల్‌టీటీ - దానాపూర్ మధ్య ప్రతి రోజు ప్రత్యేక రైలు

అక్టోబర్ 22వ తేదీ నుంచి ఎల్‌టీటీ - దానాపూర్ (01143) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపింది. ముంబయిలోని ఎ‌ల్‌టీటీ నుంచి ఉదయం 10.30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని చెప్పింది. ఆ మరునాడు సాయంత్రం 6.30 గంటలకు దానాపూర్‌కు రైలు చేరుకుంటుందని వివరించింది. ఈ రైలు ప్రతి రోజు నడుస్తుందని పేర్కొంది. నవంబర్ 11వ తేదీ వరకు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

అలాగే దానాపూర్ - ఎల్‌టీటీ (01144)మధ్య ప్రతి రోజు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వివరించింది. అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9.30 గంటలకు దానాపూర్‌లో ఈ రైలు బయలుదేరుతుంది. మూడో రోజు ఉదయం 4.30 గంటలకు ఎల్‌టీటీకి చేరుకుంటుంది. నవంబర్ 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు ప్రతి రోజు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని భారతీయ రైల్వే పేర్కొంది.


సీఎస్‌ఎంటీ - అసన్‌సోల్ మధ్య ప్రత్యేక రైలు..

ఇక సీఎస్‌ఎంటీ - అసన్ సోల్ (01145) మధ్య ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు చెప్పింది. సీఎస్‌ఎంటీ‌లో ఉదయం 11.05 గంటలకు ఈ ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. మూడో రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు అసన్‌సోల్‌కు ఈ రైలు చేరుకుంటుంది. అలాగే (01146) అసన్‌సోల్ - సీఎస్‌ఎంటీ మధ్య ప్రతి బుధవారం ఈ రైలు బయలుదేరుతుంది. అసన్‌సోల్‌లో రాత్రి 9.00 గంటలకు ఈ రైలు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.15 గంటలకు సీఎస్ఎంటీ చేరుకుంటుంది.


పుణె - దానాపూర్ ప్రత్యేక రైలు ప్రతి రోజు..

ఇక పుణె - దానాపూర్ (01202) (Pune-Danapur Daily Special) మధ్య ప్రతీ రోజు ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. పుణెలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి.. ఆ మరునాడు తెల్లవారుజాము 2.00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఇక 01206 దానాపూర్ - పుణె మధ్య ప్రత్యేక రైలు ప్రతి రోజు నడవనుంది. దానాపూర్‌లో ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. ఆ మరునాడు సాయంత్రం 6.15 గంటలకు పుణె చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.


సీఎస్ఎంటీ- అగర్తల మధ్య ప్రత్యేక రైలు

ఇక సీఎస్ఎంటీ- అగర్తల (01605) (CSMT-Agartala Weekly Special) మధ్య ప్రత్యేక రైలు నడపనుంది. ప్రతి గురువారం సీఎస్ఎంటీలో 11.05 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. ఆదివారం 1.10 గంటలకు ఈ ప్రత్యేక రైలు అగర్తలకు చేరుకుంటుంది. అలాగే ప్రతి ఆదివారం ఆగర్తలలో సాయంత్రం 3.10 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. బుధవారం తెల్లవారుజామున 3.60 గంటలకు చేరుకుంటుంది. నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 10 వ తేదీ మధ్య ఈ ప్రత్యేక రైలు నడవనుంది.


ఎల్‌టీటీ- బనారస్ మధ్య ప్రత్యేక రైలు

ఎల్‌టీటీ - బనారస్ మధ్య ప్రత్యేక రైలు (01053) (LTT-Banaras Weekly Special) నడపనుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 6 మధ్య ఈ రైలు నడవనుంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఈ రైలు బయలుదేరనుంది. ఆ మరునాడు సాయంత్రం 4.05 గంటలకు వారణాసి చేరుకోనుంది. అలాగే బెనారస్ నుంచి ఎల్‌టీటీకి ప్రతి గురువారం ఈ ప్రత్యేక రైలు 01504 బయలుదేరనుంది. బెనారస్‌లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి.. ఆ మరునాడు ఎల్‌టీటీకి 11.35 గంటలకు చేరనుంది.


ఎల్‌టీటీ - దానాపూర్ మధ్య వారంలో రెండు సార్లు.. (LTT-Danapur Biweekly Special)

అక్టోబర్ 26, 28, అలాగే నవంబర్ 2, 4 తేదీల మధ్య వారంలో రెండు సార్లు ఎల్‌టీటీ దానాపూర్ మధ్య ఈ ప్రత్యేక రైలు (01009)నడవనుంది. అలాగే అక్టోబర్ 27, 29, నవంబర్ 3,5 తేదీల మధ్య వారంలో రెండు సార్లు దానాపూర్- ఎల్‌టీటీల మధ్య ప్రత్యేక రైలు (01010) నడవనుంది.


ఎల్‌టీటీ - సమస్తిపూర్ మధ్య ప్రత్యేక రైలు.. (LTT-Samastipur Weekly Special)

ప్రతి గురువారం ఈ ప్రత్యేక రైలు (01043) ఈ రెండు స్టేషన్ల మధ్య నడవనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు ఈ రైలు నడవనుంది. అలాగే సమస్తిపూర్ - ఎల్‌టీటీ మధ్య నవంబర్ 1 నుంచి 8 వ తేదీ వరకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక రైలు (01044) నడవనుంది.


ఎల్‌టీటీ - ప్రయాగరాజ్ మధ్య ప్రత్యేక రైలు (LTT Mumbai - Prayagraj Weekly Special)

ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును వారంలో ఒక రోజు నడపనుంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఈ రైలు (01045) ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రయాగ‌రాజ్ నుంచి ఎల్‌టీటీ మధ్య వారంలో ఒక రోజు ఈ రైలు (01046) నడవనుంది. ఈ రైలు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.


ఎల్‌టీటీ - గోరఖ్‌పూర్‌కు మధ్య వారంలో ప్రత్యేక రైళ్లు..

ఎల్‌టీటీ నుంచి గోరఖ్‌పూర్‌కు పలు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఇవి 25.10.2024, 27.10.2024, 01.11.2024తోపాటు 03.11.2024 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అలాగే గోరఖ్‌పూర్ నుంచి ఎల్‌టీటీకి సైతం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అవి 26.10.2024, 28.10.2024, 02.11.2024తోపాటు 04.11.2024 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

For National News And Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 04:44 PM