ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

India Summons: ట్రూడో సమక్షంలో ఖలిస్థానీ నినాదాలపై భారత్ నిరసన.. కెనడా రాయబారికి సమన్లు

ABN, Publish Date - Apr 29 , 2024 | 09:28 PM

కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై భారత్‌లో కెనడా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది. ఈ విషయాన్ని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలియజేసింది.

న్యూఢిల్లీ: కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో (Justin Trudeau) ప్రసంగిస్తుండగా కొందరు ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ (India) తీవ్ర నిరసన తెలిపింది. దీనిపై భారత్‌లో కెనడా రాయబారికి కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సమన్లు పంపింది. ఈ విషయాన్ని ఎంఈఏ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇలాంటి ఘటనల వల్ల వేర్పాటువాదం, ఉగ్రవాదం, హింసకు కెనడా తావిచ్చినట్టు అవుతుందని, దీని ప్రభావం కెనడా-భారత్ సంబంధాలపై పడటమే కాకుండా, సొంత పౌరుల్లో పౌరుల్లో హింస, నేరతత్వా్న్ని కెనడా ప్రోత్సహించడమే అవుతుందని కెనడా రాయబారికి తెలియజేసినట్టు ఎంఈఏ ఆ ప్రకటనలో పేర్కొంది.

LokSabha Elections: దేశంలో ఎయిర్ పోర్ట్‌లకు బాంబు బెదిరింపులు


'ఖల్సా' దినోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు టొరంటోలో 'ఖల్సా' పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని ట్రూడో హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తుండాగా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు నినాదాలు చేయడంతో ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ నినాదాలను పట్టింకుకోకుండా ట్రూడో తన ప్రసంగం కొనసాగించారు. కాగా, కొంతకాలంగా భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా మారాయి. భారత ప్రభుత్వం ఖలిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందంటూ గత ఏడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాలు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. దీనిపై కెనడా దర్యాప్తు చేపట్టగా, ఆ ఆరోపణలను ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. 2023 జూన్ 18న నర్రేలోని గురుద్వారా నుంచి నిజ్జర్ బయటకు వస్తుండగా కొందరు వ్యక్తులు అతన్ని కాల్చిచంపారు.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 09:31 PM

Advertising
Advertising