కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maldivian Envoy: ముదురుతోన్న వివాదం.. మాల్దీవుల రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు

ABN, Publish Date - Jan 08 , 2024 | 02:05 PM

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.

Maldivian Envoy: ముదురుతోన్న వివాదం.. మాల్దీవుల రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు

ఢిల్లీ: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. మాల్దీవుల మంత్రుల తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఇబ్రహీం షహీబ్ వచ్చి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి. ఈ వివాదం గురించి ఇబ్రహీం షహీబ్‌తో భారత ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మాల్దీవుల హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం సమన్లు పంపిన కొన్ని గంటల్లోనే అక్కడి భారత హైకమిషనర్‌కు కూడా మాల్దీవుల ప్రభుత్వం సమన్లు పంపింది. తమతో భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు పంపిన నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ వివాదం మరింత ముదిరినట్టైంది.


కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా మార్చాలంటూ ఓ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. అంతేకాకుండా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొన్నారు. షియునా చేసిన ఈ వ్యాఖ్యలను ఇతర మంత్రులు మజీద్, మల్షా కూడా సమర్థించారు. ఇది వివాదంగా మారింది. దీంతో సదరు మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. ఈ ఘటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తును మద్దతు లభిస్తోంది. నెటిజన్లతోపాటు అనేక మంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 02:05 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising