ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drug Seizure: డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కోసం స్టార్‌లింక్‌

ABN, Publish Date - Nov 30 , 2024 | 05:45 AM

అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్‌లో భారత నౌకాదళం 500 కేజీల మాదకద్రవ్యాల(క్రిస్టల్‌ మెథంఫెటమైన్‌)ను స్వాధీనం చేసుకుంది.

  • అరేబియా సముద్రంలో 500 కేజీల డ్రగ్స్‌ పట్టివేత

చెన్నై, నవంబరు 29: అరేబియా సముద్రంలో జరిపిన ఒక ఆపరేషన్‌లో భారత నౌకాదళం 500 కేజీల మాదకద్రవ్యాల(క్రిస్టల్‌ మెథంఫెటమైన్‌)ను స్వాధీనం చేసుకుంది. 9 మందిని అదుపులోకి తీసుకుంది. నవంబరు 24న శ్రీలంక నౌకాదళం నుంచి అందిన సమాచారం మేరకు మొదలైన ఈ ఆపరేషన్‌ రెండు రోజులపాటు సాగింది. అరెస్టు చేసిన 9మందిని భారత్‌ శ్రీలంక నౌకాదళానికి అప్పగించింది. కాగా, ఈ మాదక ద్రవ్యాల రవాణాకు స్మగ్లర్లు అత్యాధునిక స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఆధారిత సమాచార పరికరాలను ఉపయోగించారని అండమాన్‌, నికోబార్‌ పోలీసులు వెల్లడించారు. అక్కడ పట్టుబడిన చేపల వేట ట్రాలర్‌ నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు.


వాటిలో ఆ ట్రాలర్‌ వెళ్లాల్సిన మార్గ సూచికలు(నావిగేషన్‌ కోఆర్డినేట్స్‌)కూడా సేవ్‌ చేసి ఉన్నాయి. ఈలన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ‘ఎక్స్‌’ నిర్వహిస్తోన్న స్టార్‌లింక్‌ సుదూర సముద్ర జలాల్లో కూడా అధిక వేగ ఉపగ్రహ ఆధారిత ఇంటర్‌నెట్‌ని అందిస్తోంది. ఇది స్మగ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. మరోవైపు, కొలంబియా దేశ అధికారుల ఆధ్వర్యంలో 60కి పైగా దేశాల అధికారులు జరిపిన ఆపరేషన్‌లో భారీఎత్తున మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. కొలంబియా నుంచి ఆస్ట్రేలియాకు ఆరు సెమి సబ్‌మెర్సిబుల్‌ పడవల్లో వీటిని రవాణా చేస్తుండగా పసిపిక్‌ మహా సముద్రంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొకెయిన్‌ 225 టన్నులు, 128 టన్నుల గంజాయితోపాటు మొత్తం 1400 టన్నులకు పైగా మాదక ద్రవ్యాలు ఉన్నాయి.

Updated Date - Nov 30 , 2024 | 05:45 AM