ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nitheesha Kandula: యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యం

ABN, Publish Date - Jun 03 , 2024 | 05:05 PM

యూఎస్‌లో భారతీయ విద్యార్థులు వరుసగా అదృశ్యమవుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యమైంది. కాలిఫోర్నియా నితీషా కందుల అదృశ్యమైంది. ఈ మేరకు పోలీసులు ఆదివారం వెల్లడించారు.

వాషింగ్టన్, జూన్ 03: యూఎస్‌లో భారతీయ విద్యార్థులు వరుసగా అదృశ్యమవుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యమైంది. కాలిఫోర్నియా నితీషా కందుల అదృశ్యమైంది. ఈ మేరకు పోలీసులు ఆదివారం వెల్లడించారు. నితీషా కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ సన్ బెర్నార్డియో (సీఎస్‌యూఎస్‌బీ) విద్యార్థి అని వారు తెలిపారు.

Also Read: AP Election Result: గీత దాటితే.. కఠిన చర్యలు


మే 28వ తేదీ నుంచి ఆమె ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. ఈ మేరకు సీఎస్‌యూఎస్‌బీ పోలీసు ఉన్నతాధికారి జాన్ గుటిరజ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాలిఫోర్నియా నెంబర్ ప్లేట్‌తో ఉన్న టోయోటా కారులో ప్రయాణిస్తున్న ఆమెను చివరి సారి లాస్ ఏంజిల్స్‌లో చూశామని పలువురు తమకు తెలియజేశారని పోలీస్ ఉన్నతాధికారి ఈ సందర్బంగా వివరించారు. అయితే ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు.

Also Read: Air India Express Flight: యువకుడు హల్‌చల్: ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్


మరోవైపు గత మాసంలో భారతీయ విద్యార్థి రుపేష్ చంద్ర చింతకింద చికాగోలో అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతడు మృతదేహాన్ని కనుగొన్నారు. అలాగే ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అరఫత్ అదృశ్యమయ్యాడు. అనంతరం అతడి మృతదేహాన్ని కీవ్‌లాండ్‌లో స్థానికులు గుర్తించారు. మృతుడు అరఫత్.. కీవ్‌లాండ్ యూనివర్శిటీలో మాస్టర్ ఐటీ చదువుతున్నాడు.

Also Read: AP Assembly Elections: ఈసీ మరో సంచలన నిర్ణయం


ఇండియా నుంచి వచ్చిన క్లాసికల్ డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్‌ను సెయింట్ లూయిస్‌లో ఆగంతకులు కాల్చి వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా సమీర్ కామత్.. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఇండియానాలో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే వివేక్ తనేజా, అకుల్ దావన్ మరణాలు సైతం పోలీసులకు అంతు చిక్కకుండా ఉన్నాయి.

Also Read: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!


అయితే యూఎస్‌లో భారతీయ విద్యార్ధులపై వరుస దాడులు జరుగుతుండడంతోపోటు వారు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. దీంతో భారత్‌లోని యూఎస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నవిద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2024 | 05:05 PM

Advertising
Advertising