Ladakh: డెమ్‌చోక్‌లో భారత బలగాల పెట్రోలింగ్ షురూ
ABN, Publish Date - Nov 01 , 2024 | 04:40 PM
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్ (Demchok sector)లో భారత బలగాల పెట్రోలింగ్ శుక్రవారంనాడు ప్రారంభమైంది. డెప్సాంగ్ సెక్టార్‌లోనూ పెట్రోలింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. డెమ్‌చోక్, డెస్పాంగ్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ రెండ్రోజుల క్రితం పూర్తవడంతో ఇరుదేశాల సైనికులు ఎల్ఏసీ వెంబడి పలు ప్రాంతాల్లో గురువారంనాడు స్వీట్లు పంచుకున్నారు.
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి. దీంతో 2020లో గస్తీ పాయింట్లకు భారత బలగాలు చేరుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో డెమ్‌చోక్ ప్రాంతంలో భారత బలగాల గస్తీ తిరిగి ప్రారంభమైనట్టు అధికారులు ప్రకటించారు.
చైనా, భారత్ బలగాల మధ్య 2020లో సరిహద్దుల మధ్య తలెత్తిన ప్రతిష్ఠంభన ఉద్రిక్తతలకు దారితీసింది. బలగాలు కాల్పులకు దిగడంతో భారత్ వైపు నుంచి 20 మంది సైనికులు, చైనా నుంచి పలువురు సైనికులు మృతిచెందారు. దీంతో ఈ ఉద్రిక్తతలకు తెరవేయాలని దౌత్య మార్గాల ద్వారా జరిగిన చర్చలు ఫలించి అక్టోబర్ 21న భారత్-చైనా మధ్య బలగాల ఉపసంహరణ, గస్తీ పునరుద్ధరణ ఒప్పందం జరిగింది. రష్యాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు జి.జిన్‌పింగ్ సమావేశం కావడం ద్వారా ఈ ఒప్పందాన్ని నొక్కిచెప్పారు. ఇరువురు నేతలు ఒప్పందాన్ని స్వాగతించారు.
ఇవి కూడా చదవండి...
Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For National News And Telugu News...
Updated Date - Nov 01 , 2024 | 04:42 PM