Train: ఇంజన్ లేని భారతదేశపు ఏకైక రైలు.. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కూడా దీని ముందు పనికిరావు..
ABN, Publish Date - Nov 13 , 2024 | 04:24 PM
మన దేశంలోనే మొట్టమొదటి ఇంజన్ లేని రైలు ఉందని మీకు తెలుసా? ఈ రైలుకు ఇంజన్ లేకపోయినా, వేగం పరంగా ఈ రైలు రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో పోటీపడుతుంది.
India's First Engine Less Train: భారతదేశపు మొదటి ఇంజన్ లేని రైలు మీరు ఎప్పుడైన చూశారా? మీరు రైలులో ప్రయాణించి ఉంటే కచ్చితంగా రైలు ముందు ఇంజిన్‌ను చూసి ఉంటారు. ఇంజిన్‌లో కూర్చున్న లోకోమోటివ్ పైలట్‌ను కూడా మీరు చూసి ఉంటారు. కానీ, భారతదేశంలో మొట్టమొదటి ఇంజిన్ లేని రైలు ఉందని మీకు తెలుసా? ఈ రైలుకు ఇంజన్ లేకపోయినా, వేగం పరంగా ఈ రైలు రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లతో పోటీపడుతుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్..
భారతదేశపు మొట్టమొదటి ఇంజన్ లేని రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా రైలు 18. ఇంజన్ లేని హైస్పీడ్ రైలు ట్రయల్ రన్‌లో గంటకు 183 కి.మీ వేగం ఉండగా, ట్రాక్‌ల సామర్థ్యం కారణంగా ఈ రైలు గంటకు 160 కి.మీ వెళుతుంది. ఇంజిన్ లేకపోతే అది వేగవంతమైన రైలు ఎలా అయింది? అని అనుకుంటున్నారా? ఈ రైలు పూర్తిగా ఆటోమేటిక్. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన ఈ రైలు దేశంలోనే మొట్టమొదటి ఇంజన్ రహిత రైలు 'ట్రైన్ 18'. రాజధాని, శతాబ్ది రైళ్లకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారసుడిగా చెప్పబడుతుంది. వేగం, సౌకర్యాల పరంగా, ఈ రైలు ప్రస్తుతం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది. ఇప్పటికి భారతీయ రైళ్లకు ప్రత్యేక ఇంజన్ కోచ్‌ని కలిగి ఉంటారు. అది బోగీలకు అనుసంధానించబడి ఉంటుంది.
మేడ్ ఇన్ ఇండియా..
రైలు 18లో బుల్లెట్ లేదా మెట్రో రైలు వంటి ఇంటిగ్రేటెడ్ ఇంజన్ ఉంది. ఇది కోచ్ లేదా బోగీలకు అనుసంధానించబడి ఉంటుంది. ప్రత్యేక ఇంజన్ లేకపోవడంతో రైలు వేగం ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ లేని ఎలక్ట్రిక్ రైలును నడపడానికి, మొత్తం వ్యవస్థను రైలు బోగీల్లోనే అమర్చారు. అయితే, రైలులో అవసరాన్ని బట్టి ఇద్దరు లోకోమోటివ్ పైలట్లు ఉన్నారు. ఈ రైలు పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద నిర్మించబడింది. దీని గరిష్ట వేగం గంటకు 180 కిమీ. కానీ ప్రస్తుతం భద్రతా సమస్యల కారణంగా రైలు గంటకు 130 కిమీ వేగంతో నడుస్తుంది. అధిక వేగం కారణంగా, ఈ రైలు ప్రయాణ సమయం దాదాపు 15 శాతం తగ్గుతుంది.
Also Read:
బుల్డోజర్ చర్యకు అధికారులదే బాధ్యత, నష్టపరిహారం చెల్లించాలి: సుప్రీం కీలక మార్గదర్శకాలు
అంబటి ఆఫీసులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్
తెలంగాణ నూతన ఆర్‌ఓఆర్ చట్టం దేశానికే రోల్ మోడల్: మంత్రి పొంగులేటి..
For More Telugu and National News
Updated Date - Nov 13 , 2024 | 04:26 PM