ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sela Tunnel: చైనాకు కౌంటర్‌గా ‘సేలా టన్నెల్’.. దీని విశేషాలేంటో తెలుసా?

ABN, Publish Date - Mar 09 , 2024 | 03:47 PM

గత కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో.. భారత్ అందుకు కౌంటర్‌గా ఓ ప్రతిష్టాత్మక పనిని చేపట్టింది. అదే.. సేలా టన్నెల్. ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో దీనిని నిర్మించారు. ఈ టన్నెల్‌ని ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శనివారం ప్రారంభించారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరుణంలో.. భారత్ అందుకు కౌంటర్‌గా ఓ ప్రతిష్టాత్మక పనిని చేపట్టింది. అదే.. సేలా టన్నెల్. ఇండియా-చైనా (India-China) సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో దీనిని నిర్మించారు. ఈ టన్నెల్‌ని ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) శనివారం ప్రారంభించారు. మొత్తం రూ.825 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ టన్నెల్.. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలో తేజ్‌పూర్ నుండి తవాంగ్‌ను కలుపుతుంది. ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్‌ - వికసిత్‌ నార్త్‌ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేశారు.


ఈ టన్నెల్ విశేషాలు

* ఈ సేలా టన్నెల్‌ను సరిహద్దు రహదారుల సంస్థ (BRO) నిర్మించింది. సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య దీనిని నిర్మించారు. మంచు, కొండచరియలు విరిగిపడటం వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ.. బాలిపారా - చారిదౌర్‌ - తవాంగ్‌ రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు.

* ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బై-లైన్ టన్నెల్. ఈ ప్రాజెక్ట్ రెండు సొరంగాలను, ఒక లింక్ రోడ్డుని కలిగి ఉంది. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 1,003 మీటర్ల పొడవు ఉండగా.. టన్నెల్‌-2 ట్విన్ ట్యూబ్‌తో 1,595 మీటర్ల పొడవు ఉంది. ఇందులో ఒకటి ట్రాఫిక్‌కి, మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. ఈ రెండు సొరంగాల మధ్య ఉండే లింక్ రోడ్డు 1200 మీటర్ల పొడవు ఉంటుంది.

* 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం రూ.825 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లుగా రోజుకు సగటున 650 మంది కార్మికులు, లేబర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం తమ సేవలు అందించారు. దీని నిర్మాణానికి సుమారు 71,000 మెట్రిక్ టన్నుల సిమెంట్.. 5,000 మెట్రిక్ టన్నుల స్టీల్.. 800 మెట్రిక్ టన్నుల పేలుడు పదార్థాలు అవసరమయ్యాయి.

* ఒకవేళ భారత్-చైనా సరిహద్దులో అత్యవసర పరిస్థితులు తలెత్తితే.. ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఈ టన్నెల్ సహాయపడుతుంది. చైనా సరిహద్దులు ఎత్తుగా ఉండటంతో.. డ్రాగన్‌ బలగాలు సులభంగా భారత దళాల కదలికలను కనిపెట్టగలవు. అయితే సొరంగమార్గం రావడంతో.. వారికి ఆ అవకాశం ఇప్పుడు శాశ్వతంగా మూసుకుపోయింది.

* ఈ టన్నెల్‌‌లో మెరుగైన భద్రతా సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. జెట్ ఫ్యాన్ వెంటిలేషన్‌ వ్యవస్థలు, లైటింగ్‌, అగ్నిమాపక పరికరాలు, SCADA-నియంత్రిత పర్యవేక్షణ వంటి అధునాతన సదుపాయాలను ఈ టన్నెల్‌లో ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 03:47 PM

Advertising
Advertising