Manipur: రాష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ బంద్..
ABN, Publish Date - Sep 10 , 2024 | 05:21 PM
మణిపూర్‌లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇంఫాల్, సెప్టెంబర్ 10: మణిపూర్‌లో ద్రోణులు, మిసైల్ దాడుల నేపథ్యంలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ సేవలు తిరిగి 16వ తేదీన పునరిద్దరిస్తామని ఆ దేశాల్లో స్పష్టం చేసింది.
Also Read: Haryana polls: వినేశ్‌పై పోటీకి బైరాగిని నిలిపిన బీజేపీ
ఇటీవల జరిగిన ద్రోణులు, మిసైల్ దాడుల వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేయ్యాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కైరావన్‌బంద్ మహిళా మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. మణిపూర్ ప్రాదేశికతతోపాటు పరిపాలన సమగ్రతను కాపాడాలంటూ వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Also Read: Madhya Pradesh: ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి.. యూపీలో మరో తోడేలు పట్టివేత
డీజీపీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుని తొలగించాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం నిరసనకారులు ఆందోళన చేపట్టారు. అందులోభాగంగా వారంతా రాజ్‌భవన్ వైపు వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భద్రతా దళాలు నిలువరించాయి. ఆ క్రమంలో ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఆందోళనకారులపై భద్రత దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి.
Also Read: Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు
ఈ దాడులకు నిరసనగా మణిపూర్ యూనివర్శిటీ విద్యార్థులు సైతం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసనల కారణంగా మధ్య తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో కర్ఫ్యూను పోలీసులు విధించారు.
Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు
Also Read: Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?
దాదాపు 16 నెలల క్రితం మణిపూర్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల కారణంగా దాదాపు 200 మందికిపైగా ప్రజలు మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో సెప్టెంబర్ 6వ తేదీన మళ్లీ ద్రోణులు, మిసైల్ దాడుల్లో చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హింసలో 8 మంది మరణించగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి
Also Read: West Bengal: మమత ప్రభుత్వంలో ‘అవినీతి’పై మాజీ ఎంపీ ఆరోపణలు
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 10 , 2024 | 05:22 PM