తెల్లారితే తొలి పోస్టింగ్.. కాటేసిన మృత్యువు..
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:27 AM
ఐపీఎస్ కావాలన్నది ఆ యువకుడికల.. ఎంతో కష్టపడి చదివి తన కలను నెరవేర్చుకున్న ఆ యువకుడు విధుల్లో చేరేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం యువ ఐపీఎస్ అధికారి దుర్మరణం
టైరు పేలి.. అదుపుతప్పి చెట్టును ఢీకొన్న వాహనం
బెంగళూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్ కావాలన్నది ఆ యువకుడికల.. ఎంతో కష్టపడి చదివి తన కలను నెరవేర్చుకున్న ఆ యువకుడు విధుల్లో చేరేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసు వాహనం టైరు పేలి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కర్ణాటక కేడర్ యువ ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్(26) దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన హర్షవర్ధన్ 2023లో ఐపీఎస్‌కు ఎంపికై శిక్షణ పొందారు. ఇటీవల మైసూరులో 4వారాల శిక్షణ ముగించుకుని, హాసన్‌లో ప్రొబేషనరీ ఏఎస్పీగా నియమితులయ్యారు. సోమవారం సాయంత్రం విధుల్లో చేరడానికి పోలీసు వాహనంలో బయల్దేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Updated Date - Dec 03 , 2024 | 04:27 AM