ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISKCON: బంగ్లాలో హిందువులపై అకృత్యాలకు నిరసనగా ఇస్కాన్ సామూహిక ప్రార్థనలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 08:54 PM

బంగ్లాలోని ఇస్కాన్ భక్తులు, ఇతర మైనారిటీలను రక్షించాలని కృష్ణ భగవానుని కోరుతూ డిసెంబర్ 1న ఇస్కాన్ ఆలయాలు, కేంద్రాల్లో జరిగే 'శాంతి ప్రార్థనల్లో' అందరూ పాల్గొనాలని సామాజిక మాద్యమం 'ఎక్స్'లో ఇస్కాన్ కోరింది.

కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులు, ప్రార్థనా మందిరాల ధ్వంసం, హత్యలు, లూటీలు, దహనకాండలకు నిరసనగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ISKCON) ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆలయాల్లో ఆదివారంనాడు సామూహిక ప్రార్థనలు జరిపింది. బంగ్లాలోని ఇస్కాన్ భక్తులు, ఇతర మైనారిటీలను రక్షించాలని కృష్ణ భగవానుని కోరుతూ డిసెంబర్ 1న ఇస్కాన్ ఆలయాలు, కేంద్రాల్లో జరిగే 'శాంతి ప్రార్థనల్లో' (PRAYER FOR PEACE) అందరూ పాల్గొనాలని సామాజిక మాద్యమం 'ఎక్స్'లో ఇస్కాన్ కోరింది.

Rahul Gandhi: జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది


మరో ఇద్దరు 'ఇస్కాన్' పూజారుల అరెస్టు

కాగా, మరో ఇద్దరు హిందూ పూజారులను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. దీనిని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ధ్రువీకరించారు. ఇద్దరు పూజారులను బంగ్లా పోలీసులు అరెస్టు చేసినట్టు తనకు సమాచారం అందిందని చెప్పారు. చిన్మయ్ ప్రభుకు ప్రసాదం ఇచ్చేందుకువెళ్లి ఆలయానికి తిరిగి వస్తుండగా ఇద్దరు భక్తులను అరెస్టు చేశారని, చిన్మయ్ ప్రభు కార్యదర్శి కనిపించకుండా పోయారని తెలిపారు. వారికోసం ప్రార్థనలు చేయాలని ఆయన ట్వీట్‌ చేశారు. మరో పోస్టులో, శుక్రవారం ఉదయం శ్రీ శ్యాందాస్ ప్రభు అనే మరో బ్రహ్మచారిని చిట్టగాంగ్ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. ''ఆయన టెర్రరిస్టులా కనిపిస్తున్నారా?'' అని ప్రశ్నించారు. సాధుపుంగవులైన ఇస్కాన్ బ్రహ్మచారులను అరెస్టు చేయడం తీవ్రమైన దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ''ఫ్రీ ఇస్కాన్ మంక్స్ బంగ్లాదేశ్'' అంటూ ట్యాగ్ చేశారు.


బంగ్లాదేశ్ హిందువులపై దాడులకు ప్రతిగా శాంతియుత నిరసనలు తెలిపిన 'ఇస్కాన్'కు చెందిన చిన్మయ్ దాస్‌ను గత ఆదివారంనాడు ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బెయిలుకు నిరాకరిస్తూ ఆయనను కోర్టు జైలుకు పంపింది. చిన్మయ్ దాస్‌ను పోలీసు వ్యానులో తరలిస్తుండగా కోర్టు ఆవరణ వద్ద పెద్ద ఎత్తున హిందూ భక్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులతో ఘర్షణ తలెత్తింది. బంగ్లాదేశ్ జెండా కంటే ఎత్తున కాషాయం జెండాను చిన్మయ్ దాస్ ఎగురవేసారన్న ఆరోపణపై ఆయనపై బంగ్లా పోలీసులు దేశద్రోహం కేసు మోపారు. చిన్మయ్ దాస్‌ను విడిచిపెట్టాలంటూ బంగ్లా హిందువులతో పాటు భారతదేశంలోనూ పలుచోట్ల నిరనలు వ్యక్తమవుతున్నాయి. 1971 బంగ్లా విముక్తి యుద్ధం సమయంలో బంగ్లా మొత్తం జనాభాలో హిందువులు 22 శాతం ఉండగా ప్రస్తుతం అది 8 శాతానికి పడిపోయింది.


ఇవి కూడా చదవండి

Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన

Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..

Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 08:55 PM