ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO: చంద్రయాన్-4, 5లపై ఇస్రో కీలక అప్‌డేట్

ABN, Publish Date - Oct 27 , 2024 | 02:58 PM

రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. రానున్న దశాబ్దంలో స్పేస్ ఎకానమీలో ప్రపంచ భాగస్వామ్యంలో భారత్ కనీసం10 శాతం మేర సహకారం అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్ 2 శాతం మేర సహకారాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఆకాశవాణిలో (ఆల్ ఇండియా రేడియో) చేసిన స్మారక ఉపన్యాసంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. పెద్ద, చిన్న అనేక పరిశ్రమలు అంతరిక్ష రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని, వారిని భాగస్వామ్యం చేసేందుకు తగిన కృషి చేస్తామని చెప్పినట్టు తెలిపింది. ఈ కంపెనీలకు సహాయం, మార్గదర్శకత్వం చేస్తున్నామని సోమనాథ్ వెల్లడించారు.


రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ను 2026లో చేపట్టే అవకావం ఉందని ఆయన చెప్పారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4 మరో రెండేళ్ల తర్వాత అంటే 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.


చంద్రయాన్-5పై కీలక ప్రకటన

ఇక భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్ట దలచిన నిసార్ (NISAR) మిషన్‌పై కూడా సోమనాథ్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో (JAXA) చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్-ల్యాండింగ్ మిషన్ అని వివరించారు. ఈ మిషన్ అసలు పేరు లుపెక్స్ (LUPEX) లేదా ‘లునార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్’ అని చెప్పారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న సమయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2025లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని చంద్రయాన్-5గా సోమనాథ్ పేర్కొన్నారు కాబట్టి చంద్రయాన్-4 పూర్తయిన తర్వాత 2028లో చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.


చంద్రయాన్-5 ప్రాజెక్ట్ చాలా భారీ మిషన్ అని, ఈ ప్రాజెక్టులో భారత్ ల్యాండర్ అందించనుండగా, జపాన్ రోవర్‌ను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-3లోని రోవర్ బరువు కేవలం 27 కేజీలే ఉండగా.. చంద్రయాన్-5లో రోవర్ బరువు ఏకంగా 350 కిలోలు ఉండనుంది.

Updated Date - Oct 27 , 2024 | 03:28 PM