ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో

ABN, Publish Date - Sep 10 , 2024 | 01:04 PM

భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.

ISRO

భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కు పెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ‘ప్లానెటరీ డిఫెన్స్’ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. భూమివైపు దూసుకొచ్చే ఖగోళ వస్తువుల నుంచి భూమిని రక్షించడమే ఈ విభాగం విధిగా ఉంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు.


భారత్‌కు చెందిన భూస్థిర ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్న కక్ష్యల కంటే దగ్గరగా భూమికి సమీపం నుంచి అపోఫీస్ గ్రహశకలం ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నట్టు సోమనాథ్ వెల్లడించారు. భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించవచ్చునని వివిరంచార. ఇంత పెద్ద పరిమాణం ఉన్న మరే ఇతర గ్రహశకలం భూమికి ఇంత దగ్గర నుంచి ప్రయాణించలేదని ఆయన చెప్పారు.

నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్ద..

గ్రహశకలం అపోఫీస్‌ పరిమాణం ఎంత పెద్దగా ఉందో ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు. భారత్‌కు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య, దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం కంటే పెద్దదని వివరించారు. గ్రహశకలం సుమారు 340 నుంచి 450 మీటర్ల వ్యాసం ఉందన్నారు. 140 మీటర్ల వ్యాసం కంటే పెద్దదైన గ్రహశకలం ఏదీ ఇప్పటివరకు భూమికి దగ్గరకు రాలేదని ఆయన ప్రస్తావించారు.


‘‘ఒక భారీ గ్రహశకలం మానవాళి అస్తిత్వానికి నిజమైన ముప్పు. ఇలాంటి ముప్పుల విషయంలో ఇస్రో అప్రమత్తంగా ఉంది. మా ‘నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్’ (NETRA) గ్రహశకలం ‘అపోఫిస్‌’ను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోంది. మనం జీవించడానికి ఒకటే భూమి ఉంది. అందుకే భవిష్యత్‌లో భూమికి ఎదురయ్యే ముప్పుల ఎదుర్కొనే విషయంలో భారత్ అన్ని దేశాలతో కలిసి పని చేస్తుంది. సహకరిస్తుంది’’ అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.


కాగా అపోఫిస్ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు తొలిసారి 2004లో గుర్తించారు. భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించనుండడంతో శాస్త్రవేత్తలు దీనిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆస్టెరాయిడ్ గమనాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. భూమిపై దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతోందనేదానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అయితే ఈ ఆస్టెరాయిడ్ భూమిని తాకకపోవచ్చునని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Updated Date - Sep 10 , 2024 | 01:31 PM

Advertising
Advertising