ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO : : కబళించింది 86వేల మీటర్ల కొండచరియ

ABN, Publish Date - Aug 04 , 2024 | 02:24 AM

కేరళలోని వయనాడ్‌ విషాదం వెనుక 86 వేల చదరపు మీటర్ల భారీ కొండచరియ ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) వెల్లడించింది.

  • ఇరువంజిపుళ నదిలో 8 కి.మీ ప్రయాణం

  • వయనాడ్‌ విషాదంపై ఇస్రో ఉపగ్రహ చిత్రం వెల్లడి

వయనాడ్‌/హైదరాబాద్‌, ఆగస్టు 3: కేరళలోని వయనాడ్‌ విషాదం వెనుక 86 వేల చదరపు మీటర్ల భారీ కొండచరియ ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) వెల్లడించింది. హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) తీసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైనట్లు వివరించింది.

ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఓ కొండ పైభాగంలో విరిగి పడిగా మిగిలిన ప్రాంతాన్ని చిత్రంలో చూపిస్తూ.. గతంలో విరిగి పడ్డ కొండ చరియ ఆనవాళ్లు కూడా ఉన్నట్లు పేర్కొంది. అంటే.. 86 వేల చదరపు మీటర్ల మేర కొండ భాగం భారీ ముక్కలుగా విడిపోయి.. కిందకు దూసుకుపోయినట్లు తెలిపింది.

అంతేకాదు.. సముద్ర మట్టానికి 1,550 మీటర్ల ఎత్తులోంచి కొండచరియలు జారుతూ.. ఇరువంజిపుళ నదిలో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో అడ్డొచ్చిన చూరల్‌మల, ముండక్కై, అట్టమల గ్రామాల్లోని ఇళ్లు, చెట్లు, నదీ తీరాలను తుడిచిపెట్టేశాయని వివరించింది.

ఈ కారణంగా ఆస్తినష్టం, ప్రాణనష్టం అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రానికి మరణాల సంఖ్య 344గా ఉన్నట్లు, ఇంకా 200 మంది జాడ తెలియరాలేదని వెల్లడించారు. భారత సైన్యం శిథిలాల కింద గాలింపును కొనసాగిస్తోందని, ఈ క్రమంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని కాపాడారని పేర్కొన్నారు.


మరోవైపు గుర్తించని మృతదేహాలకు సామూహిక ఖననాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా, కల్పేట అటవీ అధికారులు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం.. పనియా తెగకు చెందిన ఓ కుటుంబాన్ని కాపాడింది.

కొండచరియలు విరిగిపడ్డ రెండో రోజు కల్పేట అటవీ అధికారి కె.హాషిస్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ నిటారుగా ఉండే ఓ కొండను తాళ్ల సాయంతో ఎక్కి.. ఓ గుహలో తలదాచుకున్న పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబాన్ని కాపాడింది.

ఆ కొండను ఎక్కడానికి నాలుగున్నర గంటల సమయం పట్టిందని, దట్టమైన పొగమంచు ఒకవైపు.. భారీ వర్షం, విరిగిపడుతున్న కొండచరియలు ఇంకోవైపు ప్రతికూలంగా ఉన్నా.. ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు హాషిస్‌ తెలిపారు. వారిని తాళ్ల సాయంతో కాపాడారు. ఫారెస్ట్‌ అధికారుల సాహసాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఎక్స్‌లో కొనియాడారు.

Updated Date - Aug 04 , 2024 | 02:25 AM

Advertising
Advertising
<